Begin typing your search above and press return to search.

గాయాలు అయ్యేంతలా భారత్ - చైనా సైనికులు కొట్టుకున్నారా?

By:  Tupaki Desk   |   11 May 2020 11:45 AM IST
గాయాలు అయ్యేంతలా భారత్ - చైనా సైనికులు కొట్టుకున్నారా?
X
సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చాలా దేశాల్లో మామూలే. అందునా ఇరుగున ఒక పాకిస్థాన్.. ఒక చైనా లాంటి దేశాలు ఉంటే రచ్చకు అవకాశాలే ఎక్కువ. సరిహద్దు ప్రాంతమన్నంతనే అదేదో ప్రాణానికి ప్రమాదం.. మహా డేంజర్ అన్న భావనను కలుగజేయటమే కాదు.. అదే పనిగా దేశంలోకి ఉగ్రవాదుల్ని పంపేందుకు దాయాది చేసే దరిద్రపుగొట్టు వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టటం లాంటివి పాక్ సరిహద్దుల్లో మామూలే. దేశ సరిహద్దుల్లో ఉన్న చైనాతోనూ తరచూ తలనొప్పులు ఎదురు కావటం తెలిసిందే.

దేశం మీద కన్నేయటంతో పాటు.. సరిహద్దుల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు అదే పనిగా పేచీలు పెట్టుకునే దేశాలుగా పాక్.. చైనాలు మనకున్నాయి. అయితే.. ఈ గొడవలన్ని ఉద్రిక్త పరిస్థితుల్ని తీసుకురావటమే తప్పించి.. ఘర్షణ పడే వరకూ వెళ్లవు. ఒకవేళ చేజారి పోతుంటే.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. సమావేశాల ద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.

రోటీన్ కు భిన్నమైన ఘర్షణ తాజాగా భారత-చైనా సరిహద్దుల మధ్య చోటు చేసుకుంది. ప్రపంచం మొత్తం మాయదారి రోగం మీద ఫోకస్ పెట్టిన వేళ.. రెండు దేశాల సరిహద్దుల్లో జరిగిన ఈ గొడవ ఇప్పుడు షాకింగ్ గా మారింది. సిక్కింలోని నకూలా సెక్టార్ ప్రాంతంలో ఈ గొడవ జరిగింది. చైనా కవ్వింపులకు పాల్పడటం.. దానికి భారత సైనికులు స్పందించటంతో తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు.

ఈ ఉదంతంలో తప్పంతా చైనా సైనికులదే అంటున్నారు. మొదట మాటలతో మొదలై.. తర్వాత చేతల వరకూ వెళ్లిందని.. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో.. రంగంలోకి దిగిన సీనియర్ అధికారులు పరిస్థితిని చక్కదిద్దినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఎప్పుడూ లేనట్లుగా.. తాజాగా జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాయపడినట్లుగా సమాచారం. దీంతో.. వారికి వైద్య సాయాన్ని అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.