Begin typing your search above and press return to search.

అమెజాన్ లో ‘ఇంటిదొంగల’ గుట్టు రట్టు!!

By:  Tupaki Desk   |   19 Sept 2020 3:00 PM IST
అమెజాన్ లో ‘ఇంటిదొంగల’ గుట్టు రట్టు!!
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు జెఫ్ బెజోస్ సారథ్యంలో కొనసాగుతున్న అమెజాన్ లో ఇంటిదొంగలు సంస్థకు కన్నం వేశారు. అమెజాన్ మార్కెట్ ప్లేస్ లో అక్రమ మార్గం ద్వారా ప్రయోజనం పొందేందుకు ఆరుగురు అమెజాన్ సంస్థ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు సుమారు లక్ష డాలర్లను ముడుపులుగా చెల్లించారని.. కుట్రకు పాల్పడ్డారని తెలుస్తోంది.

ఈ కేసులో ఓ హైదరాబాద్ కు చెందిన భారతీయుడు సహా ఇండియన్ అమెరికన్లు ఆరుగురిపై నేరారోపణ అభియోగాలు నమోదయ్యాయి. అమెరికా గ్రాండ్ జ్యూరీ వీరిని విచారించనుంది. హైదరాబాద్ కు చెందిన నిషాద్ కుంజు (31), కాలిఫోర్నియాకు చెందిన 27ఏళ్ల రోహిత్ కడిమిశెట్టి, న్యూయార్క్ కు చెందిన ముగ్గురు, జార్జియాకు చెందిన ఒకరు ఉన్నారని తెలిపారు.

2017 నుంచి ఈ అక్రమార్కుల దందా కొనసాగుతోంది. వీరు థర్డ్ పార్టీ వ్యాపారులు, అనధికారిక కంప్యూటర్ వ్యవస్థ ద్వారా కాంపీటీటర్లకు, వినియోగదారులకు హాని కలిగే విధంగా తమ వస్తువులనే అమ్మడానికి ప్రయత్నించారని అమెరికా న్యాయశాఖ విచారణలో వెల్లడించింది.

వచ్చేనెల 15న ఈ ఆరుగురిని సీటెల్ లోని కోర్టులో హాజరు పరుచనున్నారు. ఈ కేటుగాళ్లు పదిమంది అమెజాన్ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు లంచాలు చెల్లించి కుట్ర చేసినట్టు అమెరికా అటార్నీ తెలిపారు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.