Begin typing your search above and press return to search.

బాలాకోట్.. మసూద్ ఆయువుపట్టుపై కొట్టారు..

By:  Tupaki Desk   |   26 Feb 2019 7:37 AM GMT
బాలాకోట్.. మసూద్ ఆయువుపట్టుపై కొట్టారు..
X
పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడి చేశాక ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బుధవారం ఉదయం 3.30 గంటలకు భారత వాయుసేన ఉగ్రవాద శిబిరాలపై భీకరదాడి చేసి దాదాపు 300 మందిని హతమార్చింది. పీవోకేలోని బాలాకోట్ తర్వాత పాకిస్తాన్లోని ముజఫర్ నగర్ లో భారత్ వాయుసేన దాడులకు దిగింది. ఈ దాడుల ఇంతటితో ఆగవని ఐఏఎఫ్ చీఫ్ శ్రీనివాస్ తెలిపారు.

అయితే భారత వాయుసేన దాడిపై ప్రతిదాడి చేద్దామని పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగించిన మిరాజ్ 2000 యుద్ధ విమానాల ధాటికి తట్టుకోలేమని భావించి వెనక్కుతగ్గిందట..

భారత్ నిర్ధేశిత లక్ష్యాలపై ఈ దాడులు చేసింది. ఇందులో భారత్ - పాక్ సరిహద్దుల్లోని బాలాకోట్ కీలకమైన ఉగ్రవాద స్థావర పట్టణం. కొండలు, గుట్టలు, కాలువలు, చల్లటి వాతావరణం మధ్య ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉండే ఈ చిన్న పట్టణం లో జనసంచారం పెద్దగా ఉండదు. ఇది ఉగ్రవాదలకు స్థావరంగా మారింది. ఇక్కడి జనానికి చదువు కూడా రాదు.

భారత్ లోని శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ బేస్ సెంటర్ నుంచి బయల దేరిన మిరాజ్ - జెట్ ఫైటర్ల మొట్టమొదట దాడులు చేసింది ఈ బాలాకోట్ పట్టణంలోని ఉగ్రశిబిరాలపైనే.. బాలాకోట్ పర్వతాల్లో ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన శిబిరాలను నేలకూల్చి ఉగ్రవాదులను చంపేశాయి. మోస్ట్ వాంటెడ్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేతకు బాలాకోట్ పెట్టని కోటగా మారింది. ఇక్కడి నుంచే మసూద్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. మసూద్ ర్యాలీలు, ఉగ్రవాదులను రిక్రూట్ మెంట్లు ఇక్కడి నుంచే చేసుకుంటాడు. ఇక్కడే చాలాసార్లు బహిరంగ సభలు నిర్వహించాడు. ఉగ్రవాదానికి శిక్షణలు కూడా ఇస్తాడు. అందుకే బాలాకోట్ పైనే భారత్ గురిపెట్టి ధ్వంసం చేసింది.

కరుడుగట్టిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ స్వస్థలం అబోటాబాద్. అమెరికా సైనికులు ఈ పట్టణంలోనే అతడిని హతమార్చాయి. ఇది బాలాకోట్ కు కేవలం 50 కి.మీల దూరంలో ఉండడం విశేషం. ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు యథేచ్చగా సాగుతాయి. లాడెన్ కూడా బాలాకోట్ కు వచ్చేవాడట..