Begin typing your search above and press return to search.

యంగెస్ట్ స్టార్టప్ నేషన్ గా ఇండియా

By:  Tupaki Desk   |   14 Oct 2015 2:50 PM IST
యంగెస్ట్ స్టార్టప్ నేషన్ గా ఇండియా
X
కొత్త ఆవిష్కరణలకు, స్టార్టప్ లకు భారత్ చిరునామాగా మారుతోంది. స్టార్టప్ లకు భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ''స్టార్టప్ ఇండియా- మూమెంటస్ రైజ్ ఆఫ్ ది ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్'' పేరుతో నాస్కామ్ ఇటీవల తన నివేదిక విడుదల చేసింది. ఇండియాలో స్టార్టప్ లు విస్తృతమవుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. స్టార్టప్ ల వృద్ధి విషయంలో ఇండియా ప్రపంచలోనే మూడో స్థానంలో ఉన్నట్లు నాస్కామ్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది చివరికి నాటికి ఇండియాలో స్టార్టప్ ల సంఖ్య 4200 దాటుతుందని నాస్కామ్ పేర్కొంది.

అంతేకాదు... ఇండియాలో స్టార్టప్ ల వ్యవస్తాపకుల్లో 72 శాతం మంది 35ఏళ్ల కంటే తక్కువ వయసువారేనట. దీంతో ప్రపంచంలో యంగెస్ట్ స్టార్టప్ నేషన్ గా ఇండియాను పిలుస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన సంస్థల్లో సుమారు 600 ఈ కామర్స్ కు చెందినవట. అయితే.... స్టార్టప్ లలో మహిళలు మాత్రం పెద్దగా దూసుకురావడం లేదు... ఇప్పటివరకు ఏర్పాటు చేసినవారిలో కేవలం 9 శాతమే మహిళలున్నారట.

ఇంకో విషయమేంటంటే ఇండియాలో స్టార్టప్ లు ఉద్యమంలా వెల్లువెత్తుతుండడంతో ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో దొరుకుతున్నాయి. 80 వేల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 2014తో పోల్చితే స్టార్టప్ ల ఏర్పాటుతో వచ్చిన పెట్టుబడులు 125 శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కూడా స్టార్టప్ లకు విపరీతమైన ప్రోత్సాహం అందిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్ లు ఆధారంగా మారుతున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ వ్యాఖ్యానించారంటే ఇవెంత కీలకంగా మారాయో అర్థం చేసుకోవచ్చు.