Begin typing your search above and press return to search.
చైనాకి తగిన విధంగా బుద్ది చెప్పడానికి సిద్దమైన భారత్ !
By: Tupaki Desk | 25 Aug 2020 6:03 PM ISTచైనా ఎప్పటికప్పుడు తన వక్రబుద్ధిని బయటపెడుతూ ఉంటుంది. ఏ సమయంలో ఎవరి స్థలాలను ఆక్రమించుకుందామా అన్నదే చైనా లక్ష్యం. గత కొన్ని రోజుల్లోగా చైనా , భారత్ మధ్య ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మయన్మార్, పాకిస్తాన్, ఇరాన్ల లో ఓడరేవుల ద్వారా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి భారత్ కూడా దేశ ద్వీప భూభాగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉత్తర అండమాన్ లోని ఐఎన్ ఎస్ కోహస్సా, షిబ్ పూర్, నికోబార్ లోని క్యాంప్ బెల్ స్ట్రిప్ వద్ద ఎయిర్ స్ట్రిప్ ను పూర్తి స్థాయి యుద్ధ స్థావరాలుగా భారత్ అభివృద్ధి చేస్తుందని సైనిక ఉన్నతాధికారులు తెలిపారు.
లక్షద్వీప్ లోని అగట్టి వద్ద ఉన్న ఎయిర్ స్ట్రిప్ సైనిక కార్యకలాపాల కోసం అభివృద్ధిచేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ బే నుంచి మలక్కా స్ట్రెయిట్స్ వరకు, అరేబియా సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్ వరకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు ద్వీపాలు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాలు. ప్రపంచ వాణిజ్యంలో సగానికి పైగా ఈ మార్గం ద్వారా జరుగుతున్నాయి అని ట్రై-సర్వీస్ కమాండర్ తెలిపారు.
ప్రస్తుతం చైనా మరింత సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత 70 సంవత్సరాలుగా మరుగున పడిన థాయ్ కెనాల్ ప్రాజెక్ట్ ను పొందటానికి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత్ ద్వీప భూభాగాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కూడా అత్యవసరమని భావిస్తోంది. బ్యాంకాక్ కు దక్షిణాన 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలయ్ ద్వీపకల్పం ద్వారా థాయ్ లాండ్ గల్ఫ్‌ను అండమాన్ సముద్రంతో అనుసంధానించడానికి ఈ కాలువ ప్రతిపాదించబడింది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ప్రధాన షిప్పింగ్ ఛానల్ మలక్కా జలసంధి. అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గం. దీనికి థాయ్ కెనాల్ ప్రత్యామ్నాయంగా మారనుంది. దీని ద్వారా భారత్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రయాణించే నౌకల దూరం కనీసం 1,200 కిలోమీటర్లు వరకు తగ్గిస్తుంది. దీనిపై భారత్ సన్నధం అవుతుంది.