Begin typing your search above and press return to search.

మన రైల్వేస్టేషన్లు ఇలా మార్చేస్తారట

By:  Tupaki Desk   |   2 July 2016 10:54 AM IST
మన రైల్వేస్టేషన్లు ఇలా మార్చేస్తారట
X
రైల్వేస్టేషన్లు గుర్తుకు రాగానే.. హడావుడిగా.. రద్దీగా ఉండే అపరిశుభ్ర ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. గతంతో పోలిస్తే శుభ్రత విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నా.. వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈగలు.. దోమలు.. కూర్చునేందుకు సరైన సౌకర్యాలు లేకుండా ఉండటం కనిపిస్తుంది. ఇక.. పెద్ద పెద్ద రైల్వేస్టేషన్లు అయితే.. విపరీతమైన రద్దీతో ఉండి.. మనిషి.. మనిషి రాసుకుపూసుకు తిరిగేలా ఉంటాయి.

ఇలాంటి పరిస్థితులకు చెక్ చెప్పేలా కేంద్రం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రపంచ స్థాయి రైల్వేస్టేషన్లుగా మార్చే దిశగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత గుజరాత్ లోని సూరత్.. మధ్యప్రదేశ్ లోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్లను వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్లుగా మారుస్తున్నారు. ఇందులోభాగంగా భారీగా పార్కింగ్ స్పేస్ లు.. ఎయిర్ పోర్ట్ లలో ఉండేలా విలాసవంతమైన సౌకర్యాలు.. షాపింగ్ మాళ్లు.. మల్టీఫ్లెక్స్ లు.. రెస్టారెంట్లు.. ఆఫీసులు.. చిన్నపాటి ఆసుపత్రులు.. మెట్రో.. బస్సులతో కనెక్టివిటీ ఇలా.. సకల సౌకర్యాలకు నిలయాలుగా రైల్వేస్టేషన్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పనులు మొదలైన ఈ వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత.. దేశ వ్యాప్తంగా ఉండే మరికొన్ని రైల్వేస్టేషన్లను దశల వారీగా మార్చేయనున్నారు. ఈ ప్రయత్నం పూర్తి అయితే.. దేశంలోని రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారిపోనున్నాయి.