Begin typing your search above and press return to search.

సరిహద్దులను తెరవనున్న భారత్ .. వారికి మాత్రం నో ఎంట్రీ !

By:  Tupaki Desk   |   24 Oct 2020 8:45 AM IST
సరిహద్దులను తెరవనున్న భారత్ .. వారికి మాత్రం నో ఎంట్రీ !
X
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో లక్షకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవి , కానీ ఇప్పుడు ఆ సంఖ్య 50 వేలకి పడిపోయింది. కరోనా రోజురోజుకి దేశంలో కంట్రోల్ లోకి వస్తుండటంతో .. నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు, కరోనా భయంతో మూసేసిన అంతర్జాతీయ సరిహద్దులను తిరిగి తెరవాలని ఇండియా నిర్ణయం తీసుకుంది. దీనితో ఇకపై విదేశీయులు భారత్ కి రావచ్చు అని , అయితే భారత్ కి వచ్చేవారు కేవలం వ్యాపార కార్యకలాపాల నిమిత్తం రావాలని , టూరిస్టులుగా వచ్చేవారిని ప్రస్తుతానికి అనుమతించబోమని కేంద్ర హోమ్ శాఖ పేర్కొంది. వాణిజ్య విమానాలను రెగ్యులర్ షెడ్యూల్ చేసుకోవచ్చని, అయితే, ఎయిర్ బబుల్ అగ్రిమెంట్స్ నిబంధనలను పాటించాలని ఆదేశించిన హోమ్ శాఖ, ప్రైవేటు చార్టర్ విమానాలను కూడా తిప్పుకోవచ్చని, ఓడలను కూడా విదేశీ ప్రయాణాలకు అనుమతిస్తున్నామని, ప్రయాణికులంతా క్వారంటైన్ నిబంధనలు సహా అన్ని కరోనా ప్రొటోకాల్స్ నూ తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంతగా కుదేలౌవడం , భారత వృద్ధిరేటు కూడా క్రమంగా దిగజారుతుండటం ,కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్నందునే కేంద్రం అంతర్జాతీయ సరిహద్దులను తెరవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇక ఇప్పటికే అనుమతించిన వీసాలను (టూరిస్ట్, మెడికల్, ఎలక్ట్రానిక్ వీసాలు మినహా) తక్షణం రీస్టోర్ చేస్తున్నామని తెలిపిన హోమ్ శాఖ, వీసాల కాలపరిమితి ముగిసిపోయిన వారు, తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. వ్యాపారాలు, కాన్ఫరెన్స్ లు, వర్క్, స్టడీ, రీసెర్చ్ తదితరాల కోసం వచ్చేవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. అయితే , టూరిస్టులుగా భారత్ కి రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే అని తెలిపింది.