Begin typing your search above and press return to search.
2050 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
By: Tupaki Desk | 12 Oct 2020 11:15 AM ISTప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. ఇప్పుడు అమెరికాను కూడా చైనా దాటేయడానికి రెడీ అయ్యింది. ఈ రేసులో భారత్ స్థానం ఐదోవది. కానీ 2050 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం అవతరిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
ప్రస్తుతం ఐదోస్థానంలో ఉన్నభారత్ 2050 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి మూడోస్తానానికి చేరుకోనున్నట్లు లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైన ఓ తాజా అధ్యయనంలో తెలిసింది.
ప్రస్తుతం పలుదేశాల్లో పనిచేస్తున్న జనాభా, వారి వయసు, దేశస్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా ఈ పరిశోధన జరిగింది. 2017లో భారత్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 5వస్థానంలో కొనసాగుతోంది.
ఈ గణాంకాల ఆధారంగానే పరిశోధకులు తాజా అధ్యయనం చేశారు. 2030 నాటికి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి.. 2050 నాటికి ఇండియా 3వ స్థానానికి చేరుకుంటుందని అధ్యయనం పేర్కొంది.
ఇక మొదటి రెండు స్థానాల్లో ఉన్న అమెరికా, చైనాలు 2050 నాటికి వాటి స్థానాలను నిలబెట్టుకుంటాయని తాజా అధ్యయనం పేర్కొంది.