Begin typing your search above and press return to search.

కశ్మీర్ పై పాక్ కుట్ర.. సిద్ధంగా భారత్

By:  Tupaki Desk   |   19 Sept 2020 2:41 PM IST
కశ్మీర్ పై పాక్ కుట్ర.. సిద్ధంగా భారత్
X
75వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి వేళైంది. ఈనెల 22 నుంచి 26 వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే కశ్మీర్ సమస్యను లేవనెత్తి మరోసారి భారత్ పై వ్యతిరేక ప్రచారానికి పాకిస్తాన్ రెడీ అవుతోంది. ఇరుకునపెట్టడానికి రెడీ అవుతోంది.

కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం ఆన్ లైన్ ద్వారా పాకిస్తాన్ ఈ దుర్మార్గానికి పాల్పడుతోందని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి.

పాకిస్తాన్ లోని ఇమ్రాన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ద్వారా ప్రచారం చేయనుందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఇలా భారత వ్యతిరేక ప్రచారానికి ఆ దేశం పూనుకుంటోందని ఆ వర్గాలు పేర్కొన్నారు.

భారత ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 26న ఐరాస డిబేట్ లో పాల్గొననున్నారు. అందుకు ముందు రోజు 25న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తారు.

ఇక పాకిస్తాన్ ‘కశ్మీర్’ విషయంలో పన్నుతున్న కుట్రలను ఎండగడుతామని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి త్రిమూర్తి వెల్లడించారు.