Begin typing your search above and press return to search.
చైనాకు షాకిచ్చే ఏర్పాట్లు అంత భారీగా సాగుతున్నాయట
By: Tupaki Desk | 7 Sept 2020 4:40 PM ISTగడిచిన కొంతకాలంలో భారత్ సరిహద్దుల మీద కన్నేసిన డ్రాగన్.. తన దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరుతో అలెర్టు అయిన భారత్.. సరికొత్త ఎత్తుల్ని సిద్ధం చేసుకుంటోంది. సరిహద్దు ప్రాంతాలకు సైన్యాన్ని..ఆయుధాల్ని తరలించేందుకు వీలుగా కొన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఒక ఏర్పాటుతో డ్రాగన్ కు దడ పుట్టిస్తుందని చెబుతున్నారు.
లద్దాఖ్ కు సైనిక బలగాల్ని తరలించేందుకు ఇప్పుడున్న ఏర్పాట్లకు భిన్నంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి కొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ప్రత్యేక ఏమంటే.. డ్రాగన్ కంట్లో పడకుండా సైనికులు.. ఆయుధాల్ని.. వాహనాల్ని తరలించేందుకు అవకాశం ఉండటం. సరిహద్దుల్లో నిర్మిస్తున్న ఈ మూడో వ్యూహాత్మక రహదారి దాదాపు 258 కిలోమీటర్ల పొడవున ఉండనుంది.
ఈ రహదారి నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చిందని చెబుతున్నారు. మరో 30 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తే.. ఈ వ్యూహాత్మక రహదారి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ మార్గంలో సైనికుల్ని.. సైనిక వాహనాల్ని సురక్షితంగా సరిహద్దుల్లోకి తరలించే వీలుండటం ఈ రహదారి ప్రత్యేకంగా చెబుతున్నారు.
ఈ రహదారి మంచు కొండల మధ్యగా వెళుతుండటం కారణంగా.. శత్రుదేశాల నిఘా కళ్లను తప్పించుకునే వీలుందని తెలుస్తోంది. రోడ్డు మార్గానికి రెండు పక్కలా ఎత్తైన కొండలు ఉండటం లాభిస్తుందని చెబుతున్నారు. వేగంగానే కాదు.. సురక్షితంగా సరిహద్దుల్లోకి తరలించే ఈ రహదారి దేశ రక్షణలో కీలకంగా మారనున్నట్లు చెబుతున్నారు.