Begin typing your search above and press return to search.
ఈశాన్య భారతాన్ని లోపల నుంచి కెలుకుతున్న చైనా
By: Tupaki Desk | 11 Dec 2020 1:00 PM ISTకొందమందికి చుట్టు పక్కల వాళ్ళు ప్రశాంతంగా ఉంటే అస్సలు తట్టుకోలేరు. డ్రాగన్ దేశం కూడా అలాంటి కోవలోకే చేరిపోయింది. గాల్వాన్ సరస్సు లోయలో ఇబ్బంది పెట్టాలని చూసింది. ప్యాంగ్యాంగ్ ప్రాంతంలో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది. తూర్పు లడ్డాఖ్ లో ప్రయత్నాలు చేసి ఫెయిలైంది. అందుకనే వెనుకనుండి దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రప్రభుత్వం దృష్టికి తెచ్చి అప్రమత్తం చేయటంతో వెలుగులోకి వచ్చింది.
మన భూభాగం చూట్టూ శతృవులు పొంచి ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు దాయాది దేశం పాకిస్ధాన్. మరోవైపు స్వయంగా డ్రాగన్ దేశమే కాలుదువ్వుతోంది. ఇంకోవైపు బాంగ్లాదేశ్ లోని కొన్ని గ్రూపులను మనకు వ్యతిరేకంగా దువ్వుతోంది. ఇంకోవైపు శ్రీలంకలోని భూభాగాన్ని తన చేతిలోకి తీసుకుంది చైనా సైన్యం. ఇవన్నీ చైనా ఎందుకు చేస్తోందంటే భారత్ చాలా స్పీడుగా అభివృద్ధి చెందుతోందన్న కడుపుమంట మాత్రమే అని అర్ధమైపోతోంది.
సో ప్రత్యక్షంగా చేయలేని పనిని పరోక్షంగా చేయటానికి రెడీ అయిపోయింది డ్రాగన్. అందుకనే మనదేశంలోనే ఉన్న ఈశాన్య రాష్ట్రాల ద్వారా చిచ్చుపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు గ్రూపులు లిబరేషన్ కావాలంటు ఎప్పటి నుండో గొడవలు చేస్తున్నారు. అవసరమైనపుడు సైనికచర్యలకు దిగుతు ఒక్కోసారి చర్చలు కూడా జరుపుతోంది కేంద్రప్రభుత్వం. దీన్ని ఆసరాగా తీసుకున్న చైనా ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద గ్రూపులకు శిక్షణ ఇస్తోందన్న విషయం బయటపడింది.
చైనాలోని ఆర్మీ, రిటైర్డ్ అధికారులు ప్రత్యేకంగా అధునాతన ఆయుధాల ఉపయోగంలో తీవ్రవాద గ్రూపులకు శిక్షణ ఇస్తున్నట్లు మన ఇంటెలిజెన్స్ పసిగట్టింది. తీవ్రవాదులకు మయన్మార్ భూభాగంలో శిక్షణ ఇస్తోందట చైనా. ఇందుకోసమని చైనా-మయన్మార్ ప్రాంతంలోని సరిహద్దుల్లో తిరుగుబాటుదారులకు ఆశ్రయం కల్పించినట్లు కనుగొన్నారు. మయన్మార్ లోని సాయుధ దళాలు యునైటెడ్ స్టేట్ వా ఆర్మీ, మయన్మార్ లో తీవ్రవాద సంస్ధగా ప్రచారంలో ఉన్న అరాకీన్ ఆర్మీని తనకు అనుకూలంగా చైనా వాడుకుంటోందనే ఆరోపణలున్నాయి.
ఈమధ్యనే భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని మన భూభాగంలో సాయుధులను మన సైన్యం పట్టుకున్నది. వారిని విచారించినపుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయట. మయన్మార్ లోని సాయుధ దళాలతో మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద గ్రూపులకు చైనా శిక్షణ ఇవ్వటంతో పాటు ఆయుధాలను కూడా అందిస్తోందన్న విషయం బయటపడింది. దాంతో యమన్మార్ సరిహద్దుల్లో కూడా సైనిక పహారాను పెంచింది. చూశారా ప్రత్యక్షంగా మనల్ని ఏమీ చేయలేక చివరకు వెనుకనుండి గోతులు తవ్వుతోంది. అయితే విషయం బయపడిన తర్వాత భారత్ కు వ్యతిరేకంగా తాము ఎవరికీ శిక్షణ ఇవ్వలేని వాదిస్తోంది చైనా ప్రభుత్వం.