Begin typing your search above and press return to search.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: ఉప్పల్ స్టేడియంలో గత రికార్డులేంటి?

By:  Tupaki Desk   |   25 Sep 2022 5:43 AM GMT
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: ఉప్పల్ స్టేడియంలో గత రికార్డులేంటి?
X
భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఇందు కోసం నగరంలోని ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఇప్పటికే చెరో మ్యాచ్ దక్కించుకున్న రెండు జట్లు నువ్వా నేనా..? అన్న రీతిలో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఉప్పల్ స్టేడియంలో అడేది రెండో ఇంటర్నేషనల్ మ్యాచ్. మొదటి మ్యాచ్ లోనే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. గతంలో జరిగిన ఆటలో ఇండియాను విజయం సాధించింది. ఇప్పడు కూడా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయిన చర్చించుకుంటున్నారు. మరి ఉప్పల్ స్టేడియం గురించి పూర్తిగా తెలుసుకుందామా..

హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న ఈ స్టేడియాన్ని 2004లో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ టీ 20 మ్యాచ్ లు మాత్రమే ఇందులో ఆడారు. 2019లో భారత్ వెస్టీండీస్ మధ్య పోరు సాగింది. ఈ ఆటలో ఇండియానే గెలిచింది. వెస్టిండీర్ మొదట బ్యాటింగ్ చేసి 208 పరుగులతో భారీ లక్ష్యాన్ని ముందుంచుంది. అయినా ఇండియా ఆరు వికెట్ల నష్టంతో అవలీలగా కొట్టిపడేసింది. ఈ మ్యాచ్ లో అత్యధికంగా విరాట్ కోహ్లి 94, కేఎల్ రాహుల్ 62 పరుగులు చేశారు.

అయితే అంతకుముందు 2017లో ఇక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా రద్దయింది. స్టేడిమం మొత్తం వర్షపు నీరు నిలవడంతో ఆ మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్ లు రెడీ కాగా.. ఇప్పుడు ఆడేదో మూడో మ్యాచ్ అన్నమాట. అయితే 2013లో టెస్ట్ మ్యాచ్ సాగగా.. టీమిండియానే సొంతం చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్ కూడా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉండడం విశేషం.

ఇలా మొత్తంగా ఐదు మ్యాచ్ ల తరువాత ఇప్పుడు మరోసారి ఉప్పల్ స్టేడియంలో కీలక జట్లు ఆడనున్నారు. ఇప్పటికే టిక్కెట్లు దక్కించుకున్న వారంతా సాయంత్రం సమయం ఎప్పుడవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం వుతుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో మూడో మ్యాచ్ ఇది. ఇందులో భారత్ గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. అంటే సిరీస్ డిసైడర్ గా ఉప్పల్ స్టేడియం నిలవనుంది. ఇలాంటి కీలక మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గొప్ప విషయం అని క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.