Begin typing your search above and press return to search.

భారత్-అమెరికా కీలక ఒప్పందం.. చైనాకు చుక్కులు తప్పవా!

By:  Tupaki Desk   |   2 Oct 2020 9:30 PM IST
భారత్-అమెరికా కీలక ఒప్పందం.. చైనాకు చుక్కులు తప్పవా!
X
అగ్రరాజ్యం అమెరికాతో మనదేశం ఓ కీలకమైన రక్షణ ఒప్పందాన్ని చేసుకుంది. దీంతో మన రక్షణవ్యవవస్థ మరింత పటిష్ఠంగా మారనుంది. ఇటీవల ఇరుదేశాల సంబంధాలు మెరుగవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీ-130జే సూపర్ హెర్క్యూలస్ కార్గో యుద్ధ విమానాల అదనపు పరికరాలు, విడి భాగాలను భారత్​కు విక్రయించేందుకు అమెరికా సమ్మతించింది. మొత్తం 90 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా భారత్​కు అమ్మనుంది. అయితే ఈ ఒప్పందానికి ఇటీవలే అమెరికా రక్షణశాఖ పెంటగాన్​ ఆమోదించింది. ప్రతిపాదిత అమ్మకం అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతకు తోడ్పడనుంది.

ఈ ఒప్పందంతో భారత్​ ఆసియా ఖండంలోనే ప్రబలమైన శక్తిగా ఎదగనుంది.
విమాన వినియోగ వస్తువులు, మరమ్మతు లేదా విడి భాగాలు, గ్రౌండ్ సపోర్ట్, కార్ట్‌రిడ్జ్ యాక్చుయేటెడ్ డివైజెస్ / ప్రొపెల్లెంట్ యాక్చుయేటెడ్ డివైజెస్(CAD/PAD) కోసం ఒప్పందం చేసుకుంది. అలాగే, ఏఎన్/ ఏఎల్ఆర్-56ఎం అడ్వాన్స్‌డ్ రాడార్ వార్నింగ్ రిసీవర్ షిప్‌సెట్, కౌంటర్‌మెజన్ డిస్పెన్సర్ సిస్టమ్ షిప్‌మెంట్, రాత్రివేళలో వినియోగించే పది తేలికపాటి బైనాక్యులర్స్, నైట్ విజన్ గాగుల్స్, జీపీఎస్, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు కూడా ఇందులో ఉన్నాయి. ల్యాబ్ పరికరాలు, జాయింట్ మిషన్ ప్లానింగ్ సిస్టమ్, క్రిప్టోగ్రఫిక్ డివైజ్ స్పేర్స్, లోడర్స్, సాఫ్ట్‌వేర్, పబ్లికేషన్స్, సాంకేతిక డాక్యుమెంట్లు, వ్యక్తిగత శిక్షణ, శిక్షణ పరికరాలు, ఇంజినీరింగ్, సాంకేతిక సహకారాన్ని కూడా భారత్ కోరుతోంది.

నోటిఫికేషన్ ప్రకారం.. ప్రతిపాదిత అమ్మకాలు భారత వైమానిక దళం, ఆర్మీ, నేవీ రవాణా అవసరాలు, స్థానిక, అంతర్జాతీయ మానవతా సహాయం, ప్రాంతీయ విపత్తు ఉపశమనం అవసరాలకు గతంలో కొనుగోలు చేసిన విమానం సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. సీ -130 జే సూపర్ హెర్క్యులస్ విమానాలను అమెరికా 17 దేశాలకు విక్రయించగా.. అందులో భారత్ ఒకటి. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం ఐదు విమానాలు ఉన్నాయి. మరో ఆరు సూపర్ హెర్క్యులస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ విమానాలతో భారత్​ మరింత బలోపేతం కానుంది.