Begin typing your search above and press return to search.
దీప సంకల్పం: కాంతులీనిన భారతావని
By: Tupaki Desk | 6 April 2020 9:00 AM ISTకరోనా వైరస్ కట్టడి కోసం భారతదేశమంతా ఒక్కటై నిలుస్తోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి 130 కోట్ల ప్రజలు ఒక్క తాటిపైకి వస్తున్నారు. కులమతబేధాలు.. ప్రాంతీయ.. భాష బేధాలు.. రాజకీయాలు పక్కనపెట్టేసి.. పేద.. సంపన్నులందరూ భారతీయులమని చాటి చెబుతున్నారు. ఈ క్రమంలో కరోనాపై చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తున్నారు. దీనిపై ఎలాంటి కార్యక్రమం.. ఎలాంటి కఠిన నిర్ణయాలు విధించినా అఖండ భారతవాని జై కొడుతోంది. భారత ప్రభుత్వం ఏం సందేశం.. ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే గతంలో జనతా కర్ఫ్యూ విధించగా అద్భుత స్పందనతో భారతీయులు ఐక్యత చాటారు. తాజాగా విద్యుద్దీపాలు ఆర్పేసి దివ్యకాంతులు వెలిగించి భారతదేశాన్ని దేదీప్యమానంగా వెలిగించారు. ప్రధానమంత్రి నుంచి పాచీ పని చేసే పాలేరు కూడా దీపాలు వెలిగించి కరోనాపై చేస్తున్న పోరాటానికి సంఘీభావం పలికించారు. ఇది చేయడం వల్ల ఏం ప్రయోజనమని కొందరు ప్రశ్నిస్తుండగా.. వారికి భారతదేశ ఐకమత్యం.. కరోనాపై భారత ఉక్కు సంకల్పం ఎంత తీవ్రంగా ఉందో తెలియపరుస్తోంది.
ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు భారతదేశంలో ఒక్కసారిగా ఇళ్లు అంధకారమయ్యాయి. ఆ తర్వాత చిన్నగా దీపకాంతులు వెలిగాయి. కొన్నిచోట్ల సెల్‌ఫోన్ లైట్లు.. టార్చ్‌లైట్లు.. కొవ్వొత్తులు ప్రకాశించాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సినీ, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులందరూ దివ్యజ్యోతులు వెలిగించి కరోనాపై చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. దీంతో భారతదేశంలో మరోసారి దీపావళి పండుగ వచ్చినట్టు కనిపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి.. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు దీపకాంతుల్లో భారతదేశం వెలుగులీనింది. ఈ దిపాలంకరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దీపాలు వెలిగించి మరోసారి భారతదేశ సత్తా ప్రపంచానికి చాటిచె ప్పారు. ఆ దీపకాంతుల్లో వెలుగులు చూడడానికి రెండు కళ్లు చాలలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన కుటుంబసభ్యులు, సహచర మంత్రులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. అంధకారంలో ఉన్న ప్రగతిభవన్‌లో కొత్త కాంతులు వెలుగులు జిమ్మాయి. తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కూడా కొవ్వొత్తులు వెలిగించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు కూడా తమ తమ నివాసాల్లో ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు.