Begin typing your search above and press return to search.

కాలుష్య మరణాల్లో మనమే టాప్.. అయితే ఎందుకు గుర్తించరు?

By:  Tupaki Desk   |   20 May 2022 2:30 PM GMT
కాలుష్య మరణాల్లో మనమే టాప్.. అయితే ఎందుకు గుర్తించరు?
X
కాలుష్యం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 9 మిలియన్ల మరణాలకు ఈ వాయుకాలుష్యం కారణమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక నగరాల్లో మన ఢిల్లీ కూడా ఉండడం గమనార్హం. అక్కడ నివాసం ఉంటున్న వారు గాలీ పీల్చాలంటేనే కష్టంగా మారిపోయింది. అక్కడ క్రికెట్ ఆటగాళ్లు కూడా ముక్కులకు మాస్క్ లతో క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి.

చలికాలం వస్తే చాలు ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంది. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా మారడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చిన్నారుల పరిస్థితి చెప్పలేని విధంగా ఉంది. పిల్లలు బయటకు వస్తే ఖచ్చితంగా అనారోగ్యం బారిన పడేలా పరిస్థితి ఉంది.వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా నవంబర్ లో చాలా రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కానీ ప్రకటించిన సెలవులను భర్తీ చేసే ప్రక్రియను మాత్రం చేపట్టలేదు. దీంతో విద్యార్థుల చదువులకు నష్టం వాటిల్లుతోంది. ఢిల్లీ, పరిసరా ప్రాంతాల్లో వాయుకాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా భారీగా పడిపోతోంది.

ఇక దేశంలోని చాలా నగరాల్లో కూడా వాయు కాలుష్య తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ లోని కొత్త అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా 2019లో భారతదేశంలోని 24 లక్షల మంది మరణించారన్న సంచలన విషయాన్ని బయటపెట్టింది. కరోనాకు ముందు ఈ అధ్యయనం నిర్వహించారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి తొమ్మిది మిలియన్ల మరణాలకు వాయుకాలుష్యమే కారణమని ఈ అధ్యయనం పేర్కొంది. కార్లు, ట్రక్కులు, పరిశ్రమల నుంచి వచ్చే కలుషితమైన గాలి కారణంగా మరణాల సంఖ్య 2000 నుంచి 55శాతం పెరిగింది. కాగా వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు భారత్ లోనే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది.

ధుమాపానం.. వారి పక్కనున్న వారి ప్రాణాలు కూడా తీస్తోంది. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ అధ్యయనం తెలిపింది. గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం తదితర అనారోగ్యకారణంగానే వీరు చనిపోయారని బాధితుల డెత్ సర్టిఫికెట్లలో పేర్కొన్నారు. వీటన్నింటికి కారణమైన వాయుకాలుష్యమే ఈ మరణాలకు దారితీసిందని ఏ డాక్టర్ కూడా సర్టిఫై చేయలేకపోయారు.

2020లో విడుదలైన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా ఢిల్లీ ఉందని పేర్కొంది. అంతకుముందు 2016లో భారతదేశంలో సంభవించిన మొత్తం వ్యాధుల్లో 6శాతానికి వాయుకాలుష్యం కారణమని.. 2017 నాటి ఇండియా స్టేట్ లెవల్ డిసీజ్ బర్డెన్ రిపోర్ట్ పేర్కొంది.

ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 30 నగరాల్లో 22 భారతదేశంలోనే ఉన్నాయి. ఢిల్లీ రాజధాని ఢిల్లీ అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధానిగా మారిపోయిందని పలు నివేదికలు, సంస్థలు నివేదిస్తున్నాయి.

ఢిల్లీలోపాటు ఘజియాబాద్, బులంద్ షహర్, బిస్రఖ్ జలాల్ పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా, ముజఫర్ నగర్ , రాజస్థాన్ లోని భివారీ, ఫరీదాబాద్, జింద్,హిసార్, ఫతేహాబాద్, బంధ్వారీ, గురుగ్రామ్,యుమానా నగర్, రోహ్ తక్, ధారుహేరా, ముజఫర్ పూర్ నగరాల్లో కూడా కాలుష్యం అత్యధికంగా పెరిగిపోయిందని నివేదికలు చెబుతున్నాయి.

వంటకోసం వాడే బయోమాస్ బర్నింగ్, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమ, నిర్మాణం, వ్యర్థాలను కాల్చడం.. పాటు విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, వాహనాలు, నిర్మాణాలు,వ్యర్థాలను కాల్చడం వంటి ద్వారా బహిరంగ వాతావరణ కాలుష్యం పెరిగింది.

దేశంలో ఢిల్లీతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వాయుకాలుష్యం మోతాదుకు మించి ఉందని నివేదికలు తేల్చాయి.