Begin typing your search above and press return to search.

అమెరికాలో మ‌నోళ్లు సృష్టించిన రికార్డ్ ఇది

By:  Tupaki Desk   |   10 July 2018 9:59 AM IST
అమెరికాలో మ‌నోళ్లు సృష్టించిన రికార్డ్ ఇది
X
అగ్రరాజ్యం అమెరికాలో మ‌నోళ్ల స‌త్తాకు ఇదో నిద‌ర్శ‌నం. భార‌తీయుల ప్ర‌తిభాపాట‌వాలకు మెచ్చి ఆ దేశంలో ఎలా ఎర్రతివాచి ప‌రుస్తుందో తెలియ‌జెప్పేందుకు తాజా తార్కాణం ఇది. ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలపై ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించిన తాజా నివేదిక అమెరికాలో భార‌తీయుల ముద్ర‌ను మ‌రోమారు చాటిచెప్పింది. ఎనిమిదేళ్ల కాలంలో ల‌క్ష కాదు రెండు ల‌క్ష‌లు కాదు ఏకంగా 12 ల‌క్ష‌ల‌ మంది నైపుణ్య‌వంతులైన ఇండియ‌న్లు అమెరికాకు ఒక్క ఏడాదిలోనే ప‌య‌న‌మ‌య్యార‌ని తేలింది.

ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక ప్ర‌కారం అమెరికాకు వ‌లస‌వెళ్లిన భార‌తీయుల త‌ర్వాతి స్థానంలో పిలిప్పిన్లు నిలిచారు. 2010 సంవ‌త్స‌రంలోనే 3ల‌క్ష‌ల మంది మంది పిలిప్పిన్స్ దేశ‌స్తులు కెన‌డాకు వెళ్లారు. అదే ఏడాదికి మ‌నోళ్ల వ‌ల‌స‌లు ప‌ది ల‌క్ష‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ వ‌ల‌స‌ల జోరు ఇలా సాగుతోంద‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ తెలిపింది. ఉపాధి కోసం - మెరుగైన అవ‌కాశాల కోసం - నైపుణ్యాల కోసం ఆయా దేశాలకు వ‌ల‌స వెళుతున్నార‌ని విశ్లేషించింది. ఇందులో స‌హ‌జంగానే అమెరికా టాప్‌ లో ఉంద‌ని తేల్చింది. అయితే, ఇటీవ‌లి కాలంలో ఆయా దేశాల వీసాల నిబంధ‌న‌ల కార‌ణంగా వ‌ల‌స‌ల్లో కొంత మార్పు వ‌చ్చింద‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ పేర్కొంది.