Begin typing your search above and press return to search.

డ్రాగన్ నేవీకి చెక్ పెట్టనున్న భారత్..సూపర్ స్కెచ్

By:  Tupaki Desk   |   7 Oct 2020 3:20 PM IST
డ్రాగన్ నేవీకి చెక్ పెట్టనున్న భారత్..సూపర్ స్కెచ్
X
డ్రాగన్-భారత్ మధ్య సరిహద్దుల్లో పరిస్ధితులు రోజురోజుకు ఉద్రిక్తతంగా మారుతున్నాయి. మన సైన్యాన్ని కవ్వించి యుద్ధానికి వచ్చేట్లుగా చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది. లడ్దాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ, ప్యాంగ్యాంగ్ పర్వత ప్రాంతాల్లో కొద్ది నెలలుగా మన సైన్యాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతోందో అందరు చూస్తున్నదే. ఏ విధంగా చూసినా మనకన్నా డ్రాగన్ సైన్యం అన్నీ విధాలుగా గట్టిదనే చెప్పాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు విషయాల్లో మనపై డ్రాగన్ కు స్పష్టమైన ఆధిపత్యముంది. అయితే అన్నీ రంగాల్లో మనకన్నా చైనాదే పైచేయి అయినా యుద్ధం చేయటానికి ఎందుకింతగా డ్రాగన్ తటపటాయిస్తోంది ? ఎందుకంటే యుద్ధమంటూ మొదలైతే చైనాతో శతృత్వమున్న దేశాల సైన్యాలన్నీ మనకు మద్దతుగా రంగంలోకి దిగుతాయి.

ఇంతేకాకుండా ఒకపుడు ఉన్న బేలగా మన సైన్యాలు ఇపుడు లేవు. పైన చెప్పుకున్న మూడు మార్గాల్లోను మన దేశం కూడా అపారమైన సామర్ధ్యాన్ని పెంచుకుంది. అయితే మిగిలిన విషయాల్లో ఎలాగున్నా నేవీ విషయంలో ప్రధానంగా సబ్ మెరైన్ల విషయంలో చైనా బాగా బలిష్టంగా ఉంది. కంటికి కనిపించకుండా సముద్రపు లోతుల్లో ప్రయాణించి శతృదేశాల టార్గెట్ల దగ్గరకు చేరుకుని క్షిపణలను ప్రయోగించే సత్తా సబ్ మెరైన్లకుంది. ఇటువంటి సబ్ మెరైన్లు 20 ఉంటే చైనా దగ్గర 70 ఉన్నాయి. ఇందులో అణ్యాయుధాలు ప్రయోగించే సత్తా ఉన్న సబ్ మెరైన్లు ఏడున్నాయి.

ఇప్పటికప్పుడు సబ్ మెరైన్లను రెడీ చేసుకోవటం ఏ దేశం వల్లా కాదు. కాబట్టి భారత్ వల్ల కూడా సాధ్యం కాదన్న విషయం స్పష్టం. మరి ఇపుడు మనదేశం ఏమి చేయాలి ? ఏమి చేస్తోంది ? ఏమి చేస్తోందంటే సబ్ మెరైన్ల సంఖ్యను పెంచుకోవటం సాధ్యం కాదు కాబట్టే చైనా సబ్ మెరైన్లను దెబ్బ కొట్టగలిగిన పరిజ్ఞానాన్ని పెంచుకుంటోంది. శతృదేశపు సబ్ మెరైన్లను గుర్తించి వెంటాడి వేటాడే సాంకేతికతో పాటు ధ్వంసం చేయగలిగిన క్షపణులను రెడీ చేసుకుంటున్నది.

సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ శతృవుల సబ్ మెరైన్లను వెంటనే పసిగట్టగలిగిన సామర్ధ్యమున్న పీ-8ఐ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్టులను కొనుగోలు చేసింది. సబ్ మెరైన్లను గుర్తించటంలో అమెరికా తయారీ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్టులను మించినవి లేవని సమాచారం. వీటికి అదనంగా ఎం హెచ్-60 రోమియో సీహాక్ హెలికాప్టర్లను యాంటి సబ్ మెరైన్లను కూడా మనదేశం కొనుగోలు చేసింది. కొనటమే కాకుండా వీటిని హిందు మహాసముద్ర తీరంలో శతృవుల సబ్ మెరైన్లను గుర్తించటం కోసం మనదేశం వాడుకలోకి తెచ్చేసింది. అంటే మనకు సబ్ మెరైన్లు లేవని బాధపడకుండా శతృవుల సబ్ మెరైన్లను పసిగట్టి ధ్వసం చేయగలిగిన పరిజ్ఞానం+ ఆయుధాలను సమకూర్చుకోవటం తెలివైన పనే కదా ? ఏమంటారు ?