Begin typing your search above and press return to search.

చైనాకు షాక్.. భారత్ కు అమెరికా గిఫ్ట్

By:  Tupaki Desk   |   5 Aug 2018 11:47 AM IST
చైనాకు షాక్.. భారత్ కు అమెరికా గిఫ్ట్
X
బలమైన శత్రువును ఢీకొట్టాలంటే.. అదంటే పడని దాని శత్రువుతో చెలిమి చేయాలి. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది. ఇన్నాళ్లు నియంత్రణలతో భారత్ ను దూరం పెట్టిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తనే ముందుకొచ్చి భారత్ కు ‘ప్రత్యేక హోదా’ ఇచ్చేందుకు రెడీ అయ్యింది..

తాజాగా భారత్ కు ఇప్పటివరకూ ఇవ్వనని మొండికేసిన ‘వ్యూహాత్మక వాణిజ్య హోదా-1 (ఎన్టీఏ1)ను అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రపక్షమైన ఇజ్రాయిల్ కు కూడా ఇప్పటివరకూ ఇవ్వని ఈ హోదాను భారత్ కు ఇవ్వడం విశేషంగా చెప్పవచ్చు. దక్షిణాసియాలోనే ఈ హోదా పొందిన మొట్టమొదటి దేశం మనదే కావడం విశేషం. మొత్తం ఆసియాను పరిగణలోకి తీసుకుంటే జపాన్, దక్షిణ కొరియాలకు అమెరికా ఇదివరకూ ఈ హోదా ఇచ్చింది.

అమెరికా మనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రధాన కారణం చైనానే.. కొద్దిరోజులుగా చైనా - అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు సాగుతున్నాయి. అవి తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే చైనాకు రాజకీయంగా గట్టి సందేశం పంపడమే ధ్యేయంగా భారత్ కు ఎన్ ఎస్జీ సభ్యత్వం లేకున్నా అమెరికా ఈ ఎస్టీఏ1 హోదా కట్టబెట్టడం గమనార్హం. ఈ హోదాతో భారత్ అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తింపు పొందుతుంది. అంతరిక్షం - రక్షణ రంగాల్లో హైటెక్నాలజీ ఉత్పత్తుల విక్రయాలకు ఈ హోదాతో మార్గం సుగమం అవుతుంది. న్యూక్లియర్ - అణ్వాయుధ - వివిధ టెక్నాలజీలు - పరిశోధనల తాలూకు టెక్నాలజీలన్నీ భారత్ పొందేందుకు ఈ హోదా వీలు కల్పిస్తుంది. ప్రపంచంలోనే ఈ హోదా పొందిన ఏకైక అణ్వాయుధ దేశం కూడా భారతే కావడం విశేషం.