Begin typing your search above and press return to search.

ప్రాన్స్‌లో దాడులు..ఇండియాలో చ‌ర్య‌లు

By:  Tupaki Desk   |   17 Nov 2015 6:10 PM IST
ప్రాన్స్‌లో దాడులు..ఇండియాలో చ‌ర్య‌లు
X
పారిస్‌ లో ఇటీవల జ‌రిగిన‌ దాడి ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న ముద్ర‌ను చాటుకుంటోంది. యూరప్‌ లో అత్యంత కీలకమైన నగరం పారిస్‌ లో ప‌టిష్ట‌మైన భద్రత ఏర్పాట్లు ఉంటాయి. ఈ క్ర‌మంలో అంత సెక్యురిటీ ఉండే చోటులో... పైగా ప్ర‌ధాన‌మంత్రి ఆయ‌న సెక్యురిటీ ఉన్న స‌మ‌యంలోనే ఐసిస్‌ భారీ దాడులు నిర్వహించగలిగింది. త‌ద్వారా ఐసిస్ త‌మ స‌త్తాను చాటడ‌మే కాకుండా ఆత్మవిశ్వాసం పుంజుకున్న సంకేతాలు పంపింది. ఈ నేప‌థ్యంలో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది.

పారిస్‌లో దాడి జరిగిన నేపథ్యంలో ఉగ్ర‌వాదంపై పోరాటానికి త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిరణ్ రిజుజూ భారత ప్ర‌భుత్వం త‌ర‌ఫున మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఉగ్ర వ్య‌తిరేక పోరాటానికి పూర్తి స‌హ‌కారం అందించ‌డం వ‌ల్ల ఇండియాపై కూడా ఇదేవిధమైన దాడులు కొనసాగే వీలుందని ఇంటలిజెన్ప్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలో భారత్‌ పై ఐసిస్‌ దాడులు జరిపే వీలుందని నిఘావర్గాలు భావించి సమాచారం అందించాయి. ఈ స‌మాచారం ప్రకారం హై ఎలర్ట్‌ ప్రకటించిన నిఘావర్గాలు అప్రమత్తమై బందోబస్తును మరింత పటిష్టం చేశాయి. మ‌రోవైపు కేంద్ర హోంశాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ అన్ని రాష్ర్టాల‌కు ఆదేశాలిచ్చింది. ఐసిస్ క‌న్ను దేశంపై ఉన్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుతూ త‌గు భ‌ద్ర‌త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేసింది.