Begin typing your search above and press return to search.

చైనాకు మోడీ మార్క్ షాక్ తగిలింది

By:  Tupaki Desk   |   2 Aug 2017 10:00 AM IST
చైనాకు మోడీ మార్క్ షాక్ తగిలింది
X
ప్ర‌త్య‌ర్థిపై ఒక్క‌మాట అంటే ఒక్క మాట మాట్లాడ‌ని తీరు ప్ర‌ధాని మోడీలో క‌నిపిస్తుంది. అలా అని ప్ర‌త్య‌ర్థుల్ని ఆయ‌న ప‌ట్టించుకోర‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల దాడి చేయ‌కుండా.. చేత‌ల దాడితో దిమ్మ తిరిగిపోయేలా షాకివ్వ‌టం ప్ర‌ధానికి అల‌వాటే. దేశ రాజ‌కీయ వ‌ర్గాల‌కు షాకుల మీద షాకులిస్తూ.. మోడీని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్న తీరు ఇప్పుడు రాజ‌కీయ పార్టీల్లో క‌నిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. త‌న దుర్మార్గ వైఖ‌రితో త‌న ఇరుగు.. పొరుగు దేశాల‌కు చుక్క‌లు చూపించే చైనా లాంటి దేశానికి షాకిచ్చే వాడే లేడా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. కండబ‌లం.. అంత‌కు మించిన ఆర్థిక బ‌లంతో పాటు.. దుర్మార్గ‌మైన ఆలోచ‌న‌లు సొంత‌మైన చైనాకు షాకిచ్చే విష‌యంలో అగ్ర రాజ్యాలు సైతం ఆలోచిస్తుంటాయి.

అలాంటి చైనాకు త‌న‌దైన రీతిలో షాకులు ఇవ్వ‌టం మొదలెట్టారు మోడీ. ఇప్ప‌టివ‌ర‌కూ చైనాతో పెట్టుకోవాల‌న్న ఆలోచ‌న‌ను సైతం చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని గ‌త పాల‌కుల‌కు భిన్నంగా.. ఢీ అంటే ఢీ అన్న రీతిలో త‌ల‌ప‌డే ద‌మ్ము త‌న‌కుంద‌న్న విష‌యాన్ని మోడీ స‌ర్కారు ఇప్ప‌టికే ప్ర‌ద‌ర్శించింది.

చైనా విష‌యంలో ఆచితూచి అడుగులు వేసే తీరుకు భిన్నంగా.. కొన్ని విష‌యాల్లో డ్రాగన్‌కు సైతం దిమ్మ తిరిగే నిర్ణ‌యాల్ని తాను తీసుకుంటాన‌న్న విష‌యాన్ని డోక్లాం ఇష్యూలో ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన మోడీ.. తాజాగా చైనా ఫార్మా కంపెనీకి ఊహించ‌ని రీతిలో షాకిచ్చింది. త‌మ‌తో పెట్టుకుంటే.. వాణిజ్య అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్న సందేశాన్నితాజాగా ఇచ్చారు మోడీ.

భార‌త్ లో గ్లాండ్ ఫార్మా ప‌రిశ్ర‌మ‌తో షాంఘైకి చెందిన ఫోస‌న్ ఫార్మా కంపెనీ కుదుర్చుకున్న కీల‌క ఒప్పందాన్ని భార‌త్ తిర‌స్క‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. మోడీ నేతృత్వంలోని ఎక‌నామిక్స్ అఫైర్స్ క‌మిటీ.. గ్రాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఫోస‌న్ ఫార్మా 86 శాతం వాటాను కొనుగోలు చేసిన ప్ర‌క్రియ‌ను బ్లాక్ చేసిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. ఈ అంశం అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది. ఇటీవ‌ల‌కాలంలో స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర పెరుగుతున్న ఉద్రిక్త‌ల నేప‌థ్యంలో భార‌త్ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి డ్రాగ‌న్ ఎలా రియాక్ట్ కానుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.