Begin typing your search above and press return to search.

డబ్ల్యూహెచ్ ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా కేంద్రమంత్రి ...!

By:  Tupaki Desk   |   20 May 2020 11:45 AM IST
డబ్ల్యూహెచ్ ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా కేంద్రమంత్రి ...!
X
ఈ మహమ్మారి నిలువెల్లా వణికిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని పర్యవేక్షించే కీలకమైన ప్రపంచ ఆరోగ్య సంస్థను భారత్ తన ఆధీనంలోకి తీసుకోనుంది. డబ్ల్యూహెచ్ ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌ పదవి ఈ సారి భారత్ వాసం కాబోతుంది. . ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నియమితులు అయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలను స్వీకరించబోతున్నారు

ఈయన మూడేళ్ళ పాటు ఈ హోదాలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఈ హోదా జపాన్ చేతుల్లో ఉంది. జపాన్ ‌కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని.. డబ్ల్యూహెచ్ ఓ కార్యనిర్వహక మండలి ఛైర్మన్‌ గా పనిచేస్తున్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో ..అయన స్థానములో డాక్టర్ హర్షవర్ధన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ ‌గా భాద్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్యత్వం ఉన్న 194 దేశాలు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. దీనితో ఎలాంటి పోటీ లేకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్లుగా 34 దేశాల ప్రతినిధులు కొనసాగుతున్నారు. రొటేషన్ పద్ధతిన ఛైర్మన్ పదవిని భర్తీ చేస్తారు. డబ్ల్యూహెచ్ ఓ తీసుకోబోయే నిర్ణయాలన్నింటినీ సమీక్షించే అధికారం బోర్డుకు ఉంది. ఏడాదిలో కనీసం రెండుసార్లు ఈ బోర్డు సమావేశం కావాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై పెద్దగా దృష్టి సారించరు. కరోనా వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం అందరి చూపూ ఆ సంస్థ మీదే ఉంది. ఇప్పుడు ఈ మహమ్మారి సమయంలో అందరి దృష్టి దీని పైనే ఉంది.