Begin typing your search above and press return to search.

భారత్ లో అవినీతి ఏ రేంజ్ లో ఉందో తెలుసా?

By:  Tupaki Desk   |   29 Jan 2016 4:00 AM IST
భారత్ లో అవినీతి ఏ రేంజ్ లో ఉందో తెలుసా?
X
అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేయడంతో గత రెండేళ్లలో కేంద్రంలోనూ, ఢిల్లిలోనూ అధికార మార్పిడి జరిగింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి మాత్రం యథాతథంగానే కొనసాగుతోందని అవినీతి అవగాహన దిక్సూచి (కరెప్షన్‌ పెర్సప్షన్స్‌ ఇండెక్స్‌ - సీపీఐ) స్పష్టం చేసింది.. రీసెంటుగా రిలీజ్ చేసిన అంతర్జాతీయ సీపీఐ -2015 నివేదికలో ఇండియాకు 76వ స్థానం దక్కింది. అవినీ తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలతో గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్‌, ఈ ఏడాది తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకుంది.

అవినీతి రహిత దేశంగా డెన్మార్క్‌ వరుసగా రెండో ఏడాది కూడా మొదటిస్థా నాన్నే దక్కించుకుని రికార్డు సాధించింది. 91 పాయింట్లతో మొదటి ర్యాంకును సాధించి వరుసగా రెండో ఏడాది కూడా ఫస్ట్‌ ప్లేసులో నిలిచింది. రెండో స్థానంలో ఫిన్‌ లాండ్‌ - మూడో స్థానంలో స్వీడన్‌ దేశాలున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో అవినీతి విషయంలో భారత్‌ పొరుగుదేశం భూటాన్‌ ఎంతో మెరుగైన స్థానంలో ఉంది. సీపీఐ జాబితాలో భూటాన్‌ కు 27వ స్థానం లభించింది. మరికొన్ని ఇరుగు పొరుగు దేశాలు మాత్రం మనకంటే దిగువస్థాయి ర్యాంకు లతో సరిపెట్టుకున్నాయి. చైనా 83వ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌ 139వ స్థానంలో ఉంది. పాకి స్థాన్‌ - శ్రీలంక - నేపాల్‌ దేశాలు గతంలో కంటే ర్యాంకు ను మెరుగు పరుచుకున్నాయి. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ అంతటా అన్ని దేశాల్లోనూ సీపీఐ సర్వే నిర్వహించినట్లు ప్రకటించింది. ఇండియా - శ్రీలంక నేతలు ప్రభుత్వంలో ఉండి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. బంగ్లాదేశ్‌ - కంబోడియా లు అవినీతిని నిర్మూలించడానికి ప్రజల్లో అవగాహన ను వృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ - పాకిస్థాన్‌ లు అవినీతిని నిర్మూలించడంలో విఫలమయ్యాయని తేలింది.

మరోవైపు ఉత్తరకొరియా - సోమాలియాలు రెండూ 8 పాయింట్లు సాధించి చిట్టచివరి స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో బ్రెజిల్‌ 5 పాయింట్లు పోగొట్టుకుని 76వ స్థానం నుంచి ఏడు ర్యాంకులు దిగజారింది. నెదర్లాండ్‌ మొదటిసారి అవినీతిరహిత 5 దేశాల జాబితాలో చేరింది. స్విట్జర్లాండ్‌ ఏడో స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది.