Begin typing your search above and press return to search.

ప్రపంచంలోని 35 దేశాల్లో భారత్ కు 6వ స్థానం

By:  Tupaki Desk   |   27 Oct 2020 11:15 AM IST
ప్రపంచంలోని 35 దేశాల్లో భారత్ కు 6వ స్థానం
X
ఒక సమసమాజ స్థాపన జరగాలంటే ఖచ్చితంగా విద్య, గురువులు బలంగా ఉండాలి. ఏ దేశమైతే విద్యాపరంగా పరిఢవిల్లుతుందో ఆ దేశ భావి భారత పౌరులు ప్రయోజకులు అవుతారు. ప్రపంచాన్ని ఏలుతారు. ఇప్పుడు ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ ను నడిపించేది భారతీయులే కావడం విశేషం

మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువ లేనిది. వారి కృషికి గుర్తింపు దక్కింది. ప్రపంచంలోనే ఉపాధ్యాయులను గౌరవించడంలో భారత్ 6వ స్థానంలో నిలవడం విశేషం.

బ్రిటన్ కు చెందిన వార్కీ ఫౌండేషన్ గత వారం ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా ఒక్కో దేశంలో వెయ్యిమందిని ప్రశ్నించారు.

టీచర్లపై విశ్వాసం ఎంత? వారు స్ఫూర్తిని పంచుతున్నారా? ప్రజ్ఞావంతులా తదితర ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ఉపాధ్యాయులకు గుర్తింపు ఇవ్వడంలో చైనా, ఘనా, సింగపూర్, కెనడా, మలేసియా, భారత్ దేశాలు తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి.

ఉపాధ్యాయులను గౌరవించడం మన నైతిక బాధ్యత అని వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సన్నీ వార్కీ చెప్పారు. భారత్ లో ప్రభుత్వం విద్య కోసం 14శాతం ఖర్చు పెడుతోందన్నారు.