Begin typing your search above and press return to search.

మన ర్యాంక్ 130.. టాప్ టెన్ ఎవరు..?

By:  Tupaki Desk   |   15 Dec 2015 10:51 AM IST
మన ర్యాంక్ 130.. టాప్ టెన్ ఎవరు..?
X
మానవ అభివృద్ధి సూచి. చదివిన వెంటనే మెదడుకు ఎక్కని మాట. పదంగా గుర్తుండిపోయినా.. ఇంతకీ మానవ అభివృద్ధి సూచి అంటే ఏమిటంటే.. సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నములుతారు. పాఠ్యాంశాల్లో నిర్వచనం మాదిరిగా చెప్పాల్సి వస్తే.. ‘‘ఒక దేశంలో సాధించిన మౌలికమైన మానవ అభివృద్ధి విజయాల (తలసరి ఆదాయం.. సగటు ఆయుర్దాయం.. పిల్లల సగటు విద్యాకాలం.. లైంగిక అసమానత్వ సూచి.. లాంటివెన్నో అంశాలు) ను’’ మానవ అభివృద్ధి సూచిగా లెక్కిస్తారు. ఇలాంటి లెక్కలు వేసినప్పుడు ప్రపంచంలోని 188 దేశాల్లో భారతదేశ ర్యాంకు 130. మరీ.. ఇంత అడుగునా అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. గడిచిన ఏడాదిలో 5 ర్యాంకులు మెరుగు పడిన పరిస్థితి.

సూచికలో మనకన్నా కింద ఉన్న దేశాల్ని చూస్తే.. బంగ్లాదేశ్ (142).. పాకిస్థాన్ (147)లు ఉన్నాయి. ఇక.. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్.. రష్యా.. ఇండియా.. చైనా.. సౌతాఫ్రికాలో చూస్తే భారతదేశమే చివరి స్థానంలో నిలుస్తుంది. ప్రపంచ శక్తిగా భారత్ మారాలన్న మాటలకు.. వాస్తవానికి మధ్య దూరం ఎంత ఉందన్న విషయం మానవ అభివృద్ధి సూచి స్పష్టం చేస్తుంది. జాబితాలో చివర్లో ఉన్న మనకు.. అగ్రస్థానంలో ఉన్న టాప్ టెన్ దేశాలు ఏమేం ఉంటాయో చూస్తే.. మన లక్ష్యం ఎంత పెద్దదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

మానవ సూచిలో టాప్ 10 దేశాలు చూస్తే..

1. నార్వే

2. ఆస్ట్రేలియా

3. స్విట్జర్లాండ్

4. డెన్మార్క్

5. నెదర్లాండ్స్

6. జర్మనీ

7. ఐర్లాండ్

8. అమెరికా

9. కెనడా

10. న్యూజిలాండ్