Begin typing your search above and press return to search.

ఇండియా ర్యాంక్ 158/205 ఆ విషయంలో..

By:  Tupaki Desk   |   17 Aug 2022 5:28 AM GMT
ఇండియా ర్యాంక్ 158/205 ఆ విషయంలో..
X
75 ఏళ్ల స్వాతంత్ర్య సంబురాలు అంబరాన్నంటాయి. ఆాజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఇండియా వెలిగిపోతోందని మోడీ సహా కేంద్రమంత్రులంతా ఘనంగా పొగిడేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఉందంటూ కీర్తించారు. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దేశం చాలా వెనుకబడి ఉందని విశ్లేషకులు లెక్కలతో సహా నిరూపిస్తున్నారు.

తాజాగా ప్రముఖ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన వేళ ఇండియా 6వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఏర్పడింది. 2032 నాటికి 3వ స్థానానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. తలసరి ఆదాయం 1947లో 60 డాలర్ల నుంచి ఇప్పుడు 2200 డాలర్లకు పెరిగింది. ఇది మనకు గర్వకారణం.. కానీ తలసరి ఆదాయంలో 205 దేశాలలో భారత్ 158వ స్థానంలో ఉంది. ఓసారి ఆలోచించించండి అంటూ విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారీ జనాభా ఉండడంతో మన ఆర్థిక వ్యవస్థ 6వ స్థానంలో నిలిచింది. కానీ ఈ ఆదాయాన్ని పంచితే మాత్రం తలసరి ఆదాయంలో మన ఎక్కడో ఉన్నాం. మొత్తం 205 దేశాల్లో 158వ స్తానంలో ఉన్నాం. ప్రజల వద్ద ఆదాయం లేదని స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతోంది. కొన్ని పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీల వల్ల ఎదుగుదల ఉన్నా.. క్షేత్రస్తాయిలో సాధారణ ప్రజానీకానికి మాత్రం ఆదాయం లేదన్న విషయం తేటతెల్లమైంది.

75 ఏళ్ల భారతం కాదు.. ఇప్పుడు ఆ స్థాయిలో మనం అభివృద్ధి చెందామా? లేదా? అన్నది కావాలి. మనకంటే తర్వాత స్వాతంత్ర్యం పొందిన చైనా ఇప్పుడు అమెరికాతో పోటీపడుతోంది. మనం ఇంకా కనీస సౌకర్యాల కల్పన వద్దే ఆగిపోయాయాం. చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి మన పొరుగున ఉన్న దేశాల్లో కూడా మనకంటే తలసరి ఆదాయం మెరుగ్గా ఉంది. కిందటేడాది మే నెలలో తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ ఏకంగా భారత్ ను మించిపోయింది. కరోనా టైంలో మన ఆర్తిక ప్రగతి మందగించినా బంగ్లాదేశ్ లో మాత్రం ఆ ఛాయలు అంతగా కనిపించలేదు.

దేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే పడిపోయింది.బంగ్లాదేశ్ లో తలసరి ఆదాయం భారత్ కంటే 10 డాలర్లు ఎక్కువగా ఉందని గతంలో వెల్లడించారు. ఇప్పుడు భారత్ 38 డాలర్లపైగా బంగ్లాకంటే ఎక్కువ తలసరి ఆదాయంతో పుంజుకుంది.

మొత్తంగా భారత్ వెలిగిపోతుందని జబ్బలు చరుచుకునే బదులు.. మనం ఎక్కడ ఉన్నామన్న సంగతిని గుర్తుపెట్టుకుంటే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.