Begin typing your search above and press return to search.
వచ్చే ఏడాదికి చైనాను క్రాస్ చేయనున్న భారత్
By: Tupaki Desk | 11 July 2022 8:19 PM ISTఇప్పటికిప్పుడు ఆర్థిక రంగంలో లేదా టెక్నాలజీ పరంగా చైనాను భారత్ దాటే అవకాశం లేదు. కాని జనాభా విషయంలో వచ్చే ఏడాదికి చైనా ను భారత్ క్రాస్ చేయబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా ఐక్యరాజ్య సమితి అంచనా వేసి చెప్పింది. ఇండియా మరియు చైనా ల జనాభా అత్యధికంగా ఉన్న విషయం తెల్సిందే. అయితే గడచిన పదేళ్లుగా చైనా జనాభా పెరుగుదల చాలా వరకు తగ్గింది. అందువల్ల ఇప్పుడు ఇండియా జనాభాలో చైనాను బీట్ చేయబోతుంది.
చైనా జనాభా పెరుగుదల శాతం తగ్గడంతో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల పథకాలు ప్రకటించి జనాభాను పెంచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయినా కూడా ఫలితం కనిపించడం లేదు.
భారత దేశంలో కూడా జనాభా నియంత్రణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ చైనా తరహా లో మరీ నియంతృత్వపు దోరణితో జనాభా నియంత్రణ కార్యక్రమాలు జరగలేదు. అందుకే చైనాను భారత్ జనాభా విషయంలో అధిగమించబోతుంది అంటూ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్ ను తాకుతున్నట్లుగా కూడా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2030 సంవత్సరం కు 850 కోట్లు... 2050 సంవత్సరానికి 970 కోట్ల జనాభా ఈ భూమి మీద అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్ధానం పెరగడంతో పాటు మాత శిశు మరణాల రేటు బాగా తగ్గడం వల్ల కూడా జనాభా స్పీడ్ గా పెరగడం కు కారణంగా ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు పేర్కొన్నారు.
నేడు (జూలై 11) అంతర్జాతీయ జనాభా దినోత్సవం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ లెక్కలను వెల్లడించింది. ప్రస్తుతానికి జనాభా లో నెం.1 గా చైనా ఉండగా.. నెం. 2 గా ఇండియా ఉందని.. 2023 సంవత్సరంలో ఈ నెంబర్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నట్లుగా ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ప్రకటించారు. దేశ జనాభా పెరుగుదల అనేది ఒకప్పుడు అభివృద్ధికి ఆటంకం అన్నట్లుగా చర్చ జరిగేది. కాని ఇప్పుడు చైనా పరిస్థితి ని చూస్తూ ఉంటే మాత్రం ఆ ఆలోచన తప్పు అంటూ ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.