Begin typing your search above and press return to search.

ఇండియా జనాభా 2050 నాటికి తగ్గుతుందట!

By:  Tupaki Desk   |   11 July 2021 10:30 AM GMT
ఇండియా జనాభా 2050 నాటికి తగ్గుతుందట!
X
ఒకానొక సమయంలో ఎక్కడో కాని మనుషులు ఉండేవారు కాదట. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా జనాలు ఉంటారు. చాలా దేశాల్లో ప్రభుత్వాలు జనాభాను కట్టడి చేసేందుకు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నా... అడ్డదిడ్డంగా పెరుగుతూ పోతున్న జనాభాను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇలా జనాభా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనరులు కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. ఈ అధిక జనాభాతో నేడు ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కుంటుంది.

పూర్వపు రోజుల్లో జనాభాతో అసలు సమస్యలే ఉండేవి కావు. కానీ నేడు ఎక్కడికి వెళ్లినా... అంతు లేని జనాభాతో మనం అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. జనాభా పెరుగుదలతో అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే గ్రహించిన ఐక్యరాజ్య సమితి జనాభాను నియంత్రించాలని పలు దేశాలను ఆదేశించింది. అంతే కాకుండా ప్రతి ఏటా జూలై 11 న ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తుంది.

ఒకసారి గతాన్ని తిరిగి చూసుకుంటే... 1950వ సంవత్సరం వరకు స్థిరంగానే ఉన్న ప్రపంచ జనాభా ఒక్కసారిగా పెరగడం మొదలైంది. 1950 నుంచి 1987 మధ్యలో కేవలం 37 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది పెరిగారు. ఇలా ఒకేసారి హఠాత్తుగా జనాభా పెరిగిన ఈ కాలాన్ని బేబీ బూన్ అని అంటారు. మన దేశంలో జనాభా విస్ఫోటనం అధికంగా జరుగుతోంది. కానీ రానున్న కాలంలో మన దేశంలో జనాభా తగ్గనుందని అంచనాలు వేస్తున్నారు.

ఇందుకు కారణం దేశంలోని ప్రజలకు జనాభా నియంత్రణ మీద పెరిగిన అవగాహనే అని చెబుతున్నారు. ఇండియాలో జనాభా పెరుగుదలను చూసుకుంటే ప్రస్తుతం ఒకరు 2.1 కొత్త పిల్లలకు జన్మనిస్తున్నారు. కానీ కొన్ని రాష్ర్టాలలో మాత్రం ఈ సగటు ఇంకా తక్కువగా ఉండడం గమనార్హం.

ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు జనాభా పెరుగుతుందని ఆందోళన చెందుతుంటే.. విచిత్రంగా కొన్ని దేశాల వారు మాత్రం తమ జనాభా తగ్గిపోతుందంటూ గగ్గోలు పెడుతున్నారు. 2020 వ సంవత్సరంలో జపాన్‌ దేశంలో 12.7 కోట్ల మంది ఉండగా... ఈ సంఖ్య 2050 వరకు 10.6 కోట్లకు తగ్గనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఏకంగా అక్కడ జనాభాలో ఈ 30 ఏల్ల కాలంలో 16 శాతం తగ్గుదల నమోదు కానుంది.

మరో దేశం ఇటలీని తీసుకుంటే ఇక్కడ 2050 వరకు జనాభా 5 కోట్లకు చేరకుంటుందట. ప్రస్తుతం ఇటలీలో 6.1 కోట్ల మంది నివసిస్తున్నారు. ఈ రెండు దేశాలే కాకుండా... గ్రీస్‌, క్యూబా తదితర దేశాలు సైతం ఇలా జనాభా తగ్గుదలను ఎదుర్కుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.