Begin typing your search above and press return to search.

కరోనా పై వృద్ధ దంపతుల విజయం ...

By:  Tupaki Desk   |   4 April 2020 11:30 AM IST
కరోనా పై వృద్ధ దంపతుల విజయం ...
X
భారత్ లో కరోనా వైరస్ కోరలు పంజా విసురుతుంది. కరోనాను అరికట్టడానికి ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా , లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చు ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేసినా, కరోనా వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. తగ్గుముఖం పట్టడం పక్కన పెడితే .. రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి పై విజయం సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు ఫలితం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఓవైపు ప్రజలందరూ కరోనా భయంతో వణికిపోతున్నారు. అలాగే మరికొందరు కరోనా పై సరైన అవగాహనా లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ ను కేరళకు చెందిన వృద్ధ దంపతులు జయించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి నుంచి ఆ ఇద్దరు దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. 93 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్య 88 ఏళ్ల మరియమ్మ..ఈ వ్యాధి బారి నుంచి బయటపడి, అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

పత్తనంతిట్ట జిల్లాకు చెందిన థామస్‌ అబ్రహం , మరియమ్మ దంపతులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరి కుమారుడు, కోడలు, మనవడు గత నెలలో ఇటలీ నుంచి కేరళకు వచ్చారు. ఈ ముగ్గురి నుంచి అబ్రహం, మరియమ్మకు కరోనా సోకింది.దీంతో వెంటనే వీరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. కాగా వీరు శుక్రవారం నాటికి పూర్తిగా కరోనా వైరస్ నుంచి కోలుకోవడం... మరోసారి పరీక్షలు నిర్వహించిన నెగిటివ్ అని రావడంతో వీరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ వృద్ధ దంపతులు కరోనా నుంచి కోలుకోవడాన్ని చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. కాగా ఇప్పటి వరకు ఇండియాలో కరోనా సోకి కోలుకున్న వృద్ధుల్లో ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి అబ్రహామే.