Begin typing your search above and press return to search.

ఐసిస్ ప్ర‌త్యేక యాప్‌..ఇండియాపై స్పెష‌ల్ స్కెచ్‌

By:  Tupaki Desk   |   24 Jan 2017 12:50 PM IST
ఐసిస్ ప్ర‌త్యేక యాప్‌..ఇండియాపై స్పెష‌ల్ స్కెచ్‌
X
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్ భార‌త‌దేశంపై ప్ర‌త్యేక న‌జ‌ర్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ ఐఏ) దర్యాప్తులో వెల్లడైంది. దేశంలో కార్యకలాపాలు సాగించడానికి ప్రత్యేక మొబైల్‌యాప్‌ను రూపొందించుకున్నట్టు తేలింది. ఈ యాప్‌ ద్వారా సభ్యులు ఒకరికొకరు సమాచారం ఇచ్చుకోవడం, కార్యకలాపాలు సాగించే తీరును వివరించుకోవడం, కొత్త సభ్యుల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం వంటి చర్యలకు పాల్పడే వారని ఎన్‌ ఐఏ తేల్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కోడ్‌ భాషలో ఉంచుతూ ఇతరులకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలను తీసుకునే వారని దర్యాప్తులో బయటపడింది.

ఐదు రోజుల క్రితం పట్టుబడ్డ ఐఎస్‌ ఉగ్రవాది మహ్మద్‌ ఇర్ఫాన్ ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ విచారణలో అనేక‌ నిజాలు వెలుగు చూసినట్టు తెలిసింది. ముఖ్యంగా నిఘా వర్గాలకు చిక్కని తీరులో డార్క్‌ నెట్‌ ద్వారా తమ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ను ఐఎస్‌ ఉగ్రవాదులు ఆపరేట్‌ చేసే వారని తేల్చారు. ముఖ్యంగా సిరియా లోని ఐఎస్‌ ఉగ్రవాదులు మొదలుకుని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోని లష్కరే తోయిబా - జైషే మహ్మద్‌ - హిజ్భుల్‌ ముజాహిదీన్‌ మొదలైన ఉగ్రవాద సంస్థల వరకు డార్క్‌ నెట్‌ ద్వారానే తమ రహస్య సమాచార వ్యవస్థను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని ఎన్‌ ఐఏ దర్యాప్తులో వెలుగు చూసింది. త‌ద్వారా భార‌త‌దేశం కేంద్రంగా పెద్ద ఎత్తున ఇస్లామిక్ తీవ్ర‌వాదులను నియ‌మించుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/