Begin typing your search above and press return to search.

ఇక్కడ నోట్ల రద్దు చైనాలో కాసుల పంట

By:  Tupaki Desk   |   17 Dec 2016 3:09 PM IST
ఇక్కడ నోట్ల రద్దు చైనాలో కాసుల పంట
X
ఓవైపు చైనా వస్తువులు వద్దంటూ ఇండియాలో నిరసనలు... కానీ, అవే చైనా వస్తువులు లేకుండా భారత ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఏంటి? అంత సీనుందా? అనుకోవద్దు. ఇది నిజమే. డీమానిటైజేషన్ తరువాత దేశంలో ఎక్కడా కరెన్సీ లేదు. పోని కార్డులు గీకుదామంటూ కొత్తగా స్వైపు మిషన్ పెట్టుకోవడానికి వాటి ప్రొడక్షన్ కూడా సరిపడా లేదు. మరెలా... ట్రాన్జాక్షన్లు లేకుండా దేశం ఏమవుతుంది. సరిగ్గా అదే సమయంలో కొత్తగా స్వైప్ మిషన్ల తయారీకి చైనాపై ఆధారపడ్డారు. దాంతో బతికి బయటపడ్డారు. మన దగ్గర చుక్కలు చూపిస్తున్న నోట్ల రద్దు చైనాకు మాత్రం మంచి బిజినెస్ ఇచ్చినట్లయింది.

డిజిటల్ లావాదేవీల సంఖ్యను పెంచేందుకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) లేదా స్వైపింగ్ మిషన్లను 10 వేలకు పైచిలుకు జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

అయితే కేవలం నగరాల్లో మాత్రమే విరివిగా అందుబాటులో ఉన్న పీఎస్ ఓ మిషన్లను గ్రామాల్లో ప్రవేశపెట్టడానికి కొరత ఏర్పడింది. దేశీయంగా పీఎస్ ఓలను తయారుచేసే కంపెనీలకు అవసరమైన మేరకు తక్కువ సమయంలో లోటును పూడ్చే సామర్ధ్యం లేకపోవడంతో చైనాలోని రెండు కంపెనీల నుంచి పీఎస్ ఓ లను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే మిషన్లపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నారు.

దీంతో మిషన్లు తక్కువ ధరలకే వ్యాపారులకు అందుతాయి. లక్షల సంఖ్యలో కొత్త మిషిన్లు దిగుమతి చేసుకుంటుండడంతో చైనాకు మంచి బిజినెస్ దొరికింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/