Begin typing your search above and press return to search.

చైనా బార్డర్ లోకి భారత బాహుబలులు

By:  Tupaki Desk   |   1 July 2020 2:30 PM GMT
చైనా బార్డర్ లోకి భారత బాహుబలులు
X
దాదాపు 20వేల మంది చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి చేరుకున్నారు. ఓ పక్క చర్చల పేరుతో కాలయాపన చేస్తూ డ్రాగన్ దేశం సరిహద్దుల్లో యుద్ధ సామగ్రిని మోహరిస్తోంది. దీంతో భారత్ అలెర్ట్ అయ్యింది. భారత బాహుబలులను దించింది. అత్యంత వేగంగా భారత సరిహద్దులకు మన శతఘ్నులను, యుద్ధ ట్యాంకులను తరలిస్తోంది.

భారత వాయుసేనలో బాహుబలులు, భారీ కాయలు రంగంలోకి దిగాయి. చైనా సరిహద్దుకు వ్యూహాత్మక ఆయుధాలను ఈ బాహుబలులు చేర్చాయి. భారత్ జెట్ స్పీడుతో ఈ ఆయుధాలను మోహరించడానికి కారణం.. భారత వాయుసేనలోని బాహుబలులైన అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలిక్యాప్టర్లే..

భారత్ కు అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలిక్యాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా సైనికులను, భారీ యుద్ధ ట్యాంకులను సరిహద్దులకు కేవలం గంటల వ్యవధిలోనే తరలించవచ్చు.

భారత అమ్ముల పొదిలో సీ17 గ్లోబ్ మాస్టర్, సీ130 సూపర్ హెర్క్యూలెస్, సీహెచ్47 షినూక్, ఎంఐ 17 హెలిక్యాప్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ రంగంలోకి దిగి చైనా సరిహద్దుల్లోకి భారీ యుద్ధ ట్యాంకులు, యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి.

అమెరికా నుంచి ఇటీవలే కొన్ని షినూక్ హెలిక్యాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. ఇవి భారత్ వద్ద 15 ఉన్నాయి. టీ90 లాంటి అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులను కూడా సరిహద్దుల్లోకి సీ17 గ్లోబ్ మాస్టర్ భారీ విమానంలో తరలించారు. భారత రక్షణ సామగ్రి తరలింపులో ఈ అత్యాధునిక బరువైన విమానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.