Begin typing your search above and press return to search.
సిజేరియన్ల జాతర.. తల్లులకు కోతల బాధ
By: Tupaki Desk | 17 Dec 2020 1:40 PM ISTఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఈ కాలంలో సాధారణ ప్రసవం అనేది కల్ల. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్న జిల్లాల్లో కరీంనగర్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కాన్పు అంటే చాలు కడుపు కోసేస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలో బయటపెట్టింది. సిజేరియన్లు చేస్తున్న ఆస్పత్రులకు వార్నింగ్ ఇచ్చింది.
డెలివరీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి నెలకొంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 82.4 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 తెలిపింది. తాజాగా 31 జిల్లాల సర్వే వివరాలను వెల్లడించింది.
తెలంగాణలోనే అత్యంత తక్కువగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 27.2 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని పేర్కొంది.
ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లోనైతే కరీంనగర్ జిల్లాలో ఏకంగా 92.8శాతం సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నారని నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ తర్వాత గద్వాల జిల్లాలో 65.8శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని తెలిపింది.
ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతుండగా.. అత్యంత తక్కువగా కొమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.6శాతం జరుగుతున్నాయి.
ఇక హైదరాబాద్ లో ఉబకాయం పెరిగిపోతోందని.. నివేదిక తెలిపింది. బీపీ, షుగర్ వ్యాధులు చుట్టుముడుతున్నాయని వివరించింది. ఇక రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లోనూ ఉబకాయం పెరుగుతోందని తేలింది.