Begin typing your search above and press return to search.

ఆర్థికమాంద్యంలోకి భారత్..2025వరకు కష్టమే!

By:  Tupaki Desk   |   20 Nov 2020 3:40 PM IST
ఆర్థికమాంద్యంలోకి భారత్..2025వరకు కష్టమే!
X
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయ్యింది. గతంలో ఏకంగా -28శాతంకు పడిపోయింది.

కరోనాతో ముందు స్థాయితో పోలిస్తే భారత వృద్ధి 12శాతం పడిపోయిందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది. కరోనాతో ముందు ఉన్న బ్యాలెన్స్ షీట్ మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఎకనమిస్ట్ ప్రియాంక కిషోర్ నివేదికలో తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 4.5శాతం నమోదు చేయవచ్చునని.. కరోనా ముందు ఇది 6.5 శాతంగా ఉందని తెలిపారు.

కరోనా కారణంగా భారత ఆర్థిక పతనం 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి.. డిమాండ్ చర్యలు పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించిందని.. అయితే అది సరిపోదని అభిప్రాయపడ్డారు.

వడ్డీ రేట్ల తగ్గింపు వంటి నిర్ణయాలతో ఆర్బీఐ కూడా డిమాండ్ పెంచే చర్యలు తీసుకుందని తెలిపారు. భారత్ టెక్నికల్ గా మాంద్యంలోకి ప్రవేశించినట్లు ఓ డేటా వెల్లడించింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మైనస్ 10.3శాతం ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనావేసింది. 2025 వరకు భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.