Begin typing your search above and press return to search.

రెండు దేశాలతో యుద్దానికి సిద్దమైన భారత్ !

By:  Tupaki Desk   |   14 Dec 2020 11:28 AM GMT
రెండు దేశాలతో యుద్దానికి సిద్దమైన భారత్ !
X
గత కొంత కాలంగా భారత్, చైనా, భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనా కయ్యానికి కాలు దువ్వుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సరిహద్దులో భారత సైన్యం 15 రోజుల పాటు తీవ్ర స్థాయిలో జ‌రిగే యుద్ధానికి స‌రిప‌డా ఆయుధాలు ఇతర సామ‌గ్రిని సిద్ధంగా ఉంచుకునేందుకు వీలుగా బ‌ల‌గాల‌కు అధికారం కల్పించింది.

తాజా నిర్ణయంతో చైనా, పాకిస్థాన్ ‌లు ఒకేసారి భారత్ పై యుద్ధానికి వ‌చ్చినా మ‌న బ‌ల‌గాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయి. తాజా నిర్ణయంలో భారత బలగాలు రూ.50 వేల కోట్ల‌తో ఈ ఆయుధాలు, మందుగుండు సామ‌గ్రిని స‌మ‌కూర్చుకోవ‌డానికి సిద్ధ‌మౌతున్నాయి. ఇందులో భాగంగా ఆయుధాలు, మిస్సైళ్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. చైనా, పాకిస్థాన్ ‌తో ఒకేసారి యుద్ధం వ‌చ్చినా మ‌న బ‌ల‌గాలు ఎదుర్కొనే దిశ‌గా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

గ‌తంలో ప‌ది రోజుల వ‌ర‌కూ స‌రిప‌డా ఆయుధాల‌ను సిద్ధంగా ఉంచుకునేందుకే అనుమ‌తి ఉండేది. గ‌త కొంత కాలంగా వాస్త‌వాధీన రేఖ ద‌గ్గ‌ర చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌ర‌చూ భార‌త భూభాగంలోకి చొచ్చుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇటు వివాదాస్ప‌ద డోక్లాం ప్రాంతానికి స‌మీపంలో భూటాన్ భూభాగంలో ఏకంగా రోడ్లు, గ్రామాల‌ను నిర్మించేస్తోంది. అయితే చైనా దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌డానికి భార‌త ప్ర‌భుత్వం కూడా దీటుగానే బ‌దులిస్తోంది. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో మాన‌సిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది.