Begin typing your search above and press return to search.

టీకాలు వేయ‌డంలో భార‌త్ మ‌రో రికార్డు

By:  Tupaki Desk   |   15 Sep 2021 11:30 AM GMT
టీకాలు వేయ‌డంలో భార‌త్ మ‌రో రికార్డు
X
కోవిడ్ మ‌హమ్మారికి చెక్ పెట్టాలి అంటే టీకా ఒక్క‌టే ఇప్పుడు ఉన్న మార్గం కావ‌డంతో టీకా వేసే కార్య‌క్ర‌మాన్ని వేగంగా అమ‌లుచేస్తున్నారు. ప్ర‌తిరోజూ 60 ల‌క్ష‌ల మందికి పైగా టీకా అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇండియా వ్యాక్సినేష‌న్‌లో ప్ర‌పంచ రికార్డ్‌ను సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 75,89,12,277 మందికి టీకాలు అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. సెప్టెంబ‌ర్ వ‌ర‌కు దేశంలో మ‌గ‌వారికి 52.5 శాతం, స్త్రీల‌కు 47.5శాతం ఇత‌రుల‌కు 0.02 శాతం డోసులు వేసిన‌ట్టుగా కేంద్రం ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు వేసిన మొత్తం డోసుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 62.54 శాతం ఉన్న‌ట్టు కేంద్రం తెలిపింది.

దేశంలో మొత్తం 2,44,310 టీకా కేంద్రాలు ఉన్నాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 18.1 కోట్ల మంది రెండు డోసులు టీకా తీసుకున్నార‌ని తీసుకున్నార‌ని కేంద్రం తెలియ‌జేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 1,30,82,756 వ్యాక్సిన్లు పంపిణీ చేసి ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతేకాదు.. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం 65 కోట్ల కీలక మైలురాయిని దాటింది. అంతకు ముందు రోజు 59,62,286 మందికి టీకాలు వేశారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. కరోనా వైరస్‌ కట్టడికి వ‌ర‌ల్డ్‌లో లోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ‘దేశం సరికొత్త రికార్డ్ సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అత్య‌ధిక టీకాలు వేసి మునుపటి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. దేశంలో టీకా కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. కోటికి పైగా టీకా వేస్తుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.’’ అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మరో కీల‌క అడుగును దాటింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ 50 కోట్ల మంది అందుకున్నారు. కోవిడ్ వారియర్స్ కృషిని, ఈ గొప్ప విజయాన్ని సాధించడంలో వారికి సహాయపడిన వారందరికీ నా అభినందనలు. ఈ కరోనా వైరస్ కారణంగా 350 మంది మరణించారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 4,38,560 లకు పెరిగింది. భార‌త దేశంలో పాజిటీవ్ రేటు 1.13 శాతంగా ఉంది.

రికవరీ రేటు 97.53 శాతం. భార‌త దేశంలో ఇప్పటివరకు మొత్తం 52,15,41,098 సాంపిల్స్ సేకరించగా.. అందులో సోమవారం 3,94,573 నమూనాలను పరీక్షించారు. రోజువారీ పాజిటివ్ రేటు 2.22 శాతంగా ఉంది. అదే సమయంలో, వారంత‌పు పాజిటివ్ రేటు 2.51 శాతంగా ఉంది. ఇది గ‌డిచిన 67 రోజులలో మూడు శాతం కంటే తక్కువ. కోవిడ్ -19 మరణాల రేటు 1.34 శాతం. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,19,59,680 మంది కరోనా నుంచి కోలుకున్నారు.