Begin typing your search above and press return to search.
దేశంలో 500 మిలియన్లకి పైగా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ... IAMAI ప్రకటన!
By: Tupaki Desk | 7 May 2020 6:00 AM ISTఇండియా లో 504 మిలియన్ల యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ (IAMAI) తన అధ్యయనం తెలిపింది. మొత్తం 70 శాతం మంది రోజువారీ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నారని, నవంబర్ 2019 నాటికి 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా ప్రకటించింది. ఇంటర్నెట్ యూజర్లలో మొత్తం, 433 మిలియన్లు ఉండగా, వారిలో 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారే ఉన్నారు. 5-11 సంవత్సరాల వయస్సు వారిలో 71 మిలియన్ల మంది ఉన్నారు. వీరు కుటుంబ సభ్యుల డివైజ్ ల్లో ఇంటర్నెట్ ను యాక్సెస్ చేస్తున్నారని ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ అధ్యయనం తెలిపింది.
భారతదేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు 70 శాతం మంది రోజువారీ వినియోగదారులు ఉన్నారు. దేశ నగర జనాభాలో 10 మంది ఇంటర్నెట్ వినియోగదారులలో తొమ్మిది మంది వారానికి ఒకసారి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. IRS డేటా ఆధారంగా నీల్సన్ అధ్యయనం ప్రకారం.. 2019 మార్చిలో పోలిస్తే.. గ్రామీణ భారతదేశంలో, రోజుకు 30 మిలియన్ల మంది కొత్త యూజర్లు ఇంటర్నెట్ ను యాక్సెస్ చేస్తున్నారు. మూడింట ఒక వంతు మంది వినియోగదారులు ఆదివారాలు సెలవు దినాలలో సాధారణ పని దినానికి ఒక గంటకు పైగా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేస్తున్నారు.
మెరుగైన కనెక్టివిటీ, సర్వీసు క్వాలిటీ, మొబైల్ ఇంటర్నెట్, గ్రామీణ యూజర్లు భవిష్యత్తులో ఇంటర్నెట్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. 2019 నవంబర్‌లో 26 మిలియన్ల మంది కొత్త మహిళా ఇంటర్నెట్ యూజర్లు చేరారు. పురుష యూజర్లలో 9 శాతం పెరుగుదలతో పోలిస్తే.. 21శాతం పెరుగుదల ఉంది. దేశంలో 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహించడంతో డిజిటల్ సర్వీసులకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఇ-గవర్నెన్స్ ను ప్రోత్సహించడం డిజిటల్ ఇండియా దృష్టిని ప్రోత్సహించడం వంటి ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఇంటర్నెట్ సర్వీసులను వినియోగదారులకు అందించడం సాధ్యపడింది.