Begin typing your search above and press return to search.
న్యూయార్క్, లండన్, షాంఘైలను వెనక్కి నెట్టిన ఢిల్లీ.. ఎందులో అంటే
By: Tupaki Desk | 28 Aug 2021 5:00 PM ISTభారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా , భారతదేశం ఖ్యాతి ప్రపంచానికి చాటిచెప్పేలా భారత్ మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. భారతీయులంతా గర్వించే ఘనతను మన దేశ రాజధాని ఢిల్లీ సాధించింది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించింది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ప్రపంచంలోనే న్యూయార్క్, లండన్, షాంఘై నగరాలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఆ నగరాలని వెనక్కి నెట్టి , ఢిల్లీ ఎందులో తోలి స్థానంలో నిలిచిందా అని ఆలోచిస్తున్నారా. సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో అగ్రదేశాల్లోని న్యూయార్క్, లండన్, షాంఘై వంటి నగరాలను ఢిల్లీ అధిగమించింది. బహిరంగ ప్రదేశాల్లో అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నగరంగా ఘనతను సాధించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. దీనికి ఫోర్బ్స్ ఇండియాను ప్రాతిపదికగా చూపించారు.న్యూయార్క్, లండన్ వంటి నగరాలను సైతం వెనక్కి నెడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో భారత రాజధాని ఢిల్లీ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం కొంత ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు.
దీనికి సంబంధించి ఫోర్బ్స్ ఇండియాను ప్రాతిపదికగా ఆయన చూపించారు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి చదరపు మైలుకు సరాసరిన 1826 సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. లండన్ లో 1138, ఇతర నగరాల్లో అంతకంటే తక్కువ ఉన్నాయని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించినందుకు ఇంజినీర్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఢిల్లీలో మొత్తం 2.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆప్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ బాధ్యతను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు అప్పగించింది. 2019 డిసెంబర్ నాటికే 1.05 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో, రెండో స్థానంలో లండన్ ఉండగా... మూడో స్థానంలో మళ్లీ మన దేశానికి చెందిన నగరమే నిలిచింది. చెన్నై మూడో స్థానాన్ని దక్కించుకుంది. చెన్నైలో ప్రతి చదరపు మైలుకు 609 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ జాబితాలో మన దేశ ఆర్థిక రాజధాని ముంబై 18వ స్థానంలో నిలిచింది.