Begin typing your search above and press return to search.
సెక్స్ వర్కర్లలో ఏపీ టాప్
By: Tupaki Desk | 15 Feb 2016 3:17 PM ISTదేశంలో సెక్స్ వర్కర్ల హక్కుల విషయంలో ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ త్వరలో పలు సిఫారసులతో నివేదిక ఇవ్వనుంది. ఆ సిఫారసులను సుప్రీంకోర్టు ఎలా పరిగణిస్తుంది.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమిటీ సిఫారసులంటూ కొన్ని అంశాలు ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో సెక్స్ వర్కర్లు ఎంత మంది ఉన్నారు... వారి పరిస్థితి ఏమిటన్నది పరిశీలిస్తే ఆశ్చర్యపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. దేశంలోని మొత్తం సెక్స్ వర్కర్లలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారట. ఈ విషయంలో ఏపీ దేశంలోనే టాప్ పొజిషన్ లో ఉంది.
భారత దేశంలో దాదాపు 9 లక్షల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1.56 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఢిల్లీలో వీరి సంఖ్య 61వేలు. కర్ణాటక, మహారాష్ట్రలు మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్రాల ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీల్లో రికార్డైన సమాచారం ప్రకారం దేశంలో సెక్స్ వర్కర్ల సంఖ్య 6.96 లక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 1,36,794 మంది ఉన్నారు. కాగా ఈ సంఖ్య అనధికారికంగా 1,56,205గా ఉండవచ్చు. కర్ణాటకలో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 86,386 మంది ఉండగా ఈ సంఖ్య అనధికారికంగా 96,057 ఉంటుందని అంచనా. మహారాష్ట్రలో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 85,416 మంది ఉన్నారు. అనధికారికంగా 79,586 మంది. తమిళనాడులో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 43,543 మంది ఉన్నారు. ఈ సంఖ్య అనధికారికంగా 70,732 ఉండవచ్చు. పశ్చిమ బెంగాల్లోలో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 31,235 మంది కాగా అనధికారికంగా 57,850 మంది ఉన్నారు. 19 శాతం మంది సెక్స్ వర్కర్లు రిజిస్టర్ చేసుకోలేదు. అయితే... ఇవన్నీ 2009 నాటి మ్యాపింగ్ స్టడీ ఆధారంగా వేసిన లెక్కలు. తాజా అంచనాల ప్రకారం దేశంలో 12 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అంచనా.