Begin typing your search above and press return to search.

మానవత్వం చాటిన భారత జవాన్లు .. కృతజ్ఞతలు చెప్పిన చైనా సైన్యం !

By:  Tupaki Desk   |   9 Sept 2020 6:00 AM IST
మానవత్వం చాటిన భారత జవాన్లు .. కృతజ్ఞతలు చెప్పిన చైనా సైన్యం !
X
భారత్ , చైనా‌ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న ఈ సమయంలో కూడా భారత్‌ మానవత్వాన్ని చాటి మేము రక్తపాతాన్ని కోరుకోవడం లేదు అని పరోక్షంగా సంకేతాలు పంపింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న 13 జడల బర్రెలు, 4 దూడలపై మానవత్వం చూపుతూ వాటిని చైనా సైన్యానికి మన దేశ సైనికులు అప్పగించారు. ఈ విషయాన్ని ఈస్ట్రన్ కమాండ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. చైనా అధికారులు వీటి స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారని ట్వీట్‌ లో వెల్లడించింది.

ఆగస్టు 31న ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో ఇవి తిరుగుతూ కనబడ్డాయి. వీటిపై మానవత్వం చూపిస్తూ, ఈ నెల 7వ తేదీన చైనా అధికారులకు అప్పగించాం అని తెలిపింది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గించడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఓ వైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎమ్ నారావణే మాట్లాడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాలపై పట్టు కోసం ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్వాన్‌ లోయలో ఇరు దేశాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. పరిస్థితిని పునరుద్దరించడానికి ఇరుదేశాల నేతలు అనేక సార్లు చర్యలు జరుపుతున్నప్పటికీ పరిష్కారం మాత్రం దొరకడంలేదు. ఫింగర్ గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. భారత్ చైనాతో స్నేహపూర్వకంగా కొనసాగే కొద్దీ ..చైనా కవ్వింపు చర్యలకి దిగుతూనేఉంది.