Begin typing your search above and press return to search.

భారత్ - జర్మనీ మధ్య విమానాల రద్దు.. అసలు కారణం ఏమిటి?

By:  Tupaki Desk   |   2 Oct 2020 11:15 AM IST
భారత్ - జర్మనీ మధ్య విమానాల రద్దు.. అసలు కారణం ఏమిటి?
X
అనుకోని పరిణామం చోటు చేసుకుంది. భారత్ - జర్మనీల మధ్య విమాన రాకపోకలకు సంబంధించి ప్రతిష్ఠంభన సాగుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ రెండు దేశాల మధ్య విమాన రాకపోకల్ని రద్దు చేస్తూ జర్మనీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జర్మనీ అధికారిక విమానయాన సంస్థ లుఫ్తాన్సా ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్ని చూస్తే.. తప్పంతా భారత సర్కారుదే అన్నట్లుగా ఉండటం గమనార్హం. నిజంగానే రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు రద్దు కావటంతో సర్కారుదే బాధ్యత? అంటే కాదనే చెప్పాలి.

ఇంతకీ లుఫ్తాన్సా ఏం చెబుతున్నది చూస్తే.. సెప్టెంబరు చివరి వరకు అనుమతించిన ప్రత్యేక విమానాలను ఆపై కూడా కొనసాగించాలి.. భారత ప్రభుత్వం అనుకోని రీతిలో రిజెక్టు చేయటంతో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 20 మధ్యలో రెండు దేశాల మధ్య నడిచే అన్ని విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇరుదేశాల మధ్య ఎయిర్ బబుల్ ఏర్పాటు.. రెండు దేశాల మధ్య కోవిడ్ కేసులు ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఎయిర్ బబుల్ విధానం ఏమిటన్నది చూస్తే.. కోవిడ్ నేపథ్యంలో రెంు దేశాల జాతీయ వైమానిక సంస్థలు ప్రయాణికుల రాకపోకలను ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించాలి. ప్రస్తుతం భారత్ అమెరికా.. బ్రిటన్.. యూఏఈ.. మాల్దీవులు.. ఫ్రాన్స్.. కెనడా.. ఖతార్.. బహ్రైన్.. నైజీరియా.. ఇరాక్.. జపాన్ ఇలా పదమూడు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. జర్మనీ వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. భారత్ లో కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారత్ నుంచి జర్మనీకి విమానాల్ని నడిపే విషయంలో వారానికి మూడు నుంచి నాలుగు మాత్రమే విమానాలు నడిపేందుకు అనుమతులు వస్తున్నాయి.

అదే సమయంలో జర్మనీ మాత్రం 20 విమానాల్ని నడుపుతోంది. ఇలా తేడాలు ఉండటంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు దేశాలు నడిపే విమానాల మధ్య అసమానతలు ఉండొద్దని చెబితే..జర్మనీ అందుకు నో చెబుతోంది. దీంతో.. భారత్ లుఫ్తాన్సాకు వారానికి ఏడు సర్వీసులు నడిపేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇది నచ్చని ఆ విమానసంస్థ భారత్ మీద నింద మోపేలా మాటలు చెబుతూ.. సర్వీసులు రద్దు చేసినట్లుగా పేర్కొంది. జర్మనీతో పోలిస్తే భారత్ లో కేసులు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే అయినా.. వ్యాపార అవకాశాలు రెండు దేశాలకు ఒకేలా ఉండాలే తప్పించి.. కేసులను బూచిగా చూపిస్తూ తాను మాత్రమే లబ్ధి పొందాలనుకోవటం సరికాదు కదా?