Begin typing your search above and press return to search.
దేశ ప్రజలు హ్యాపీగా ఫీలయ్యే మోడీ సర్కారు రికార్డు చెప్పిన ఆర్ బీఐ
By: Tupaki Desk | 6 Jun 2020 10:30 AM ISTకొన్ని లెక్కలు అస్సలు అర్థం కావు. అలాంటి వాటిని అర్థం చేసుకోవాలన్న ఆలోచనను పక్కన పెట్టి.. చెప్పిన విషయాన్ని చెప్పినట్లుగా వినేసి సంతోష పడితే బెటర్. ఓపక్క మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విపక్షాలు గొంతుచించుకుంటున్న సంగతి తెలిసిందే. మోడీ హయాంలో ఏమున్నా లేకున్నా.. పన్నుల పోటు మాత్రం అదిరేలా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తున్న వేళ.. రిజర్వు బ్యాంక్ చెప్పిన ఒక మాట ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
గత ప్రభుత్వాల హయాంలో ఒక వార్త తరచూ న్యూస్ పేపర్లలో కనిపిస్తూ ఉండేది. భారత్ దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలలు దారుణంగా పడిపోతున్నాయని.. కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నట్లుగా వార్తలు వచ్చేవి. ఇలాంటి పరిస్థితికి భిన్నంగా తాజాగా నెలకొందన్నమాట ఆర్ బీఐ చెబుతోంది. భారత్ విదేశీ మారక నిల్వలు ఆల్ టైం రికార్డు నమోదు చేసినట్లు చెబుతున్నారు. భారీ స్థాయికి చేరిన విదేశీ మారక నిల్వలు మోడీ సర్కారు గొప్పతనంగా అభివర్ణిస్తున్నారు.
మే 29తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు ఏకంగా 343 కోట్ల డాలర్లకు పెరిగినట్లుగాచెబుతున్నారు. దీంతో.. మొత్తం విదేశీ మారక నిల్వలు 49,348 కోట్లుగా రిజర్వు బ్యాంకు చెబుతోంది. మన రూపాయిల్లో చెప్పాలంటే ఏకంగా రూ.37లక్షల కోట్లు కావటం గమనార్హం. ఇంత భారీగా విదేశీ మారక నిల్వలు పెరగటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మాయదారి రోగం విరుచుకుపడుతున్న వేళ.. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు అవుతున్న సమయంలో.. విదేశీ మారక నిల్వలు భారీగా ఉండటం ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. అదే సమయంలో బంగారు నిల్వల విలువ తగ్గుతుండటం గమనార్హం.
ఇంతలా విదేశీ మారకం పెరగటానికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. వచ్చే సమాధానం ఆసక్తికరమని చెప్పాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.. దేశీయ ఈక్విటీల్లో ఎఫ్పీఐ పెట్టుబడులు పెరగటంతోపాటు దిగుమతి వ్యయాలు తగ్గటం దేశ విదేశీ మారక నిల్వలు పెరిగేలా చేశాయని చెబుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగిన క్రెడిట్ మోడీ సర్కారు ఖాతాలో పడటం ఖాయం.