Begin typing your search above and press return to search.
వీదిబాలల కోసం సిగ్నల్ స్కూలు!
By: Tupaki Desk | 7 Sept 2016 9:48 AM ISTనేటి బాలలే రేపటి పౌరులు - భవిష్యత్ భారత మార్గనిర్ధేశకులు అని ప్రతీ చిల్డ్రన్స్ డే రోజునా ఉపన్యాశాలు తెగ వినిపిస్తుంటాయి. అయితే ఇది ఏ బాలలకు వర్తిస్తుంది. అన్నీ ఉండి చదువుకునే వారికేనా? బైకులపైనా - కార్లలోనూ - స్కూలు బస్సుల్లోనూ - ఆటోల్లోనూ స్కూళ్లకు వెళ్లగలిగేవారికి మాత్రమేనా? వారే రేపటి పౌరులా? మరి వీది బాలలు - వీదిబాలలుగా ఉండాల్సిందేనా? ఇదే ఆలోచనతో ముందుకొచ్చింది ఒక స్వచ్ఛంద సంస్థ.
మహారాష్ట్రలోని థానే నగరంలో రద్దీగా ఉండే ఒక కూడలి వద్ద చదువుకోవడానికి స్కూలుకు వెళ్లాల్సిన వయసున్న పిల్లలు బిచ్చమెత్తుకుంటూ - ఏవేవో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ తిరుగుతున్నారు. కాసేపటికి మాత్రం అక్కడే ఫ్లైఓవర్ కింద ఉన్న ఒక పెద్ద కంటైనర్ లోకి వెళ్తున్నారు. ఎందుకంటే.. చదువుకోవడానికి... అవును చదువుకోడానికి రోజూ కంటైనర్ లోకి వెళ్తున్నారు!
వివిధ కూడళ్లలో బిచ్చమెత్తుకుంటూ - ఏవో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగించే చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి ఓ స్వచ్ఛంద సంస్థ "సిగ్నల్ స్కూల్" అనే పాఠశాలను ఏర్పాటు చేసింది. ఇలాంటి ఆలోచనతో వచ్చిన భారతదేశంలోనే మొట్టమొదటి సిగ్నల్ స్కూల్. అయితే ప్రస్తుతం 22 మంది పిలల్ల ఈ స్కూల్లో ఉచితంగా చదువుకుంటున్నారు. వీరికి చదువు చెప్పడానికి నలుగురు ఉపాధ్యాయులు - ఒక ఆయా - ఒక అటెండర్ కూడా పనిచేస్తారు. వీరికి చదువుతోపాటు ఆరోగ్యం - శుభ్రత తదితర విషయాలను కూడా బోధిస్తారు. మొదట్లో కాస్త ఇబ్బంది అయినా.. ఇప్పుడిప్పుడే పిల్లలు రెగ్యులర్ గా ఈ స్కూలుకు వస్తున్నారట.
అయితే.. విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు వారిని రద్దీ ఎక్కువగా ఉండే సాయంత్రం 4 - 5 గంటల మధ్య ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఏదైనా అమ్ముకోవాడానికి మాత్రం పాఠశాల వారు అనుమతిస్తున్నారట. ఉన్నత చదువులు అభ్యసించేందుకు వారిలో ప్రేరణ కల్పించడానికి ఈ పాఠశాలలు ఎంతో ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు! ఎంత పెద్ద విప్లవం అయినా ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి అన్నట్లు... ఈ పాఠశాలలు దేశమంతా రావాలని కోరుకుందాం! ఊకదంపుడు ఉపన్యాశాలు ఇస్తే ఏమి ప్రయోజనం.. ఇలా చేతల్లో చూపించాలి కాని అని ఈ స్కూల్స్ ని చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారట. రాజకీయ నాయకులకు వినబడాలనేమో!!