Begin typing your search above and press return to search.
డెమోక్రసీలో భారత్ పడిపోయింది...మోదీ చర్యలే కారణం
By: Tupaki Desk | 22 Jan 2020 6:26 PM ISTనిజమే... వినడానికి కాస్తంత విడ్డూరంగానే ఉన్నా... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్.. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతున్న దేశాల జాబితాలో ఎగువకు కాకుండా దిగువ స్థానాలకు పడిపోయింది. అయితే ఈ తరహా విఫరిణామాలకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాలే కారణమని కూడా చెప్పక తప్పదు. ఇదేదో.. మోదీకి గిట్టని వారో, లేదంటో విపక్షాలో చెబుతున్న మాట కాదు. ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యం ఏ రకంగా పరిడవిల్లుతుందన్న విషయంపై సర్వే చేస్తే తేలిన నిజం. 2018లో ఓ మాదిరిగానే ఉన్న పరిస్థితి... 2019కి వచ్చేసరికి మరింత దిగజారిందట. అంటే... 2019లో మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాల కారణంగానే ప్రజాస్వామ్య దేశాల జాబితాలో భారత్ దిగువకు పడిపోయిందన్న మాట. గతేడాది ఈ జాబితాలో భారత్ 10 స్థానాలు కిందకు పడి 51 వ స్థానంలో నిలిచిందట.
ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏటా రూపొందిస్తున్న డెమోక్రసీ ఇండెక్స్ పై మొన్నటిదాకా అంతగా ఆసక్తి లేకున్నా... మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఈ ఇండెక్స్ కు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. అయినా ఈ ఇండెక్స్ ఏఏ అంశాల ప్రాతిపదికన రూపొందుతుందన్న విషయానికి వస్తే... ఆయా ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వ పనితీరు, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు, రాజకీయ భాగస్వామ్యం తదితర అంశాలను ఆధారం చేసుకుని ఈ ఇండెక్స్ రూపొంతుందట. ఈ అన్ని అంశాలకు ఆయా దేశాలు ఏ మేర ప్రాధాన్యం ఇచ్చాయి... ప్రజాస్వామ్యాన్ని ఏ రీతిన పరిరక్షించాయి అన్న విషయాలను పరిశీలించి గరిష్టంగా 10 మార్కులు వేస్తారట. ఈ జాబితాలో ఇప్పుడు మన దేశానికి 10 మార్కులకు గాను 6.90 మార్కులే వచ్చాయి. అదే 2018లో అయితే 7.23 మార్కులతో భారత్ 41వ స్థానంలో ఉంది. ఏడాది తిరక్కుండానే దేశంలో అల్లర్లు చెలరేగిపోగా... ప్రత్యేకించి ఆందోళనలు, నిరసనలతో హోరెత్తింది. ఫలితంగా 6.90 మార్కులు మాత్రమే తెచ్చుకున్న భారత్ 51వ స్థానానికి పడిపోయింది.
అయినా భారత్ ర్యాంకు ఇలా ఒక్క ఏడాదిలోనే పది పాయింట్లు పడిపోయేంతగా మోదీ సర్కారు ఏం చేసిందన్న వివరాల్లోకి వెళితే... గతేడాది మోదీ సర్కారు సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తీసివేయడంతో పాటుగా ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఆర్టికల్ 360ని రద్దు చేసి పారేసింది. వెరసి కశ్మీర్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు రోజుల తరబడి కొనసాగాయి. అయినా కూడా పట్టించుకోని మోదీ సర్కారు.. ఆందోళనలను అదుపు చేసేందుకు కఠిన వైఖరి అవలంబించింది. కశ్మీర్ విషయం చల్లారిందనగానే... సీఏఏ, ఎన్నార్సీలను తీసుకొచ్చిన మోదీ సర్కారు... ఈ దఫా దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైంది. మొత్తంగా పౌర హక్కుల పరిరక్షణ అసఅేమాత్రం కనిపించని పరిస్థితి. ఈ కారణంగానే ప్రజాస్వామ్యంలో భారత్ ఏకంగా పది స్థానాలు కిందకు దిగజారిందని చెప్పాలి. ఇందుకు మోదీ సర్కారు వైఖరే కారణమని కూడా చెప్పక తప్పదు.
ఇక ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్న దేశమేదంటే... అతి చిన్న దేశంగా ఉన్న నార్వే ఈ సారి టాప్ ప్లేస్ లో ఉంది. ఈ దేశానికి పది మార్కులకు గాను 9.87 మార్కులు వచ్చాయి. ఇక జనాభాలో అతి పెద్ద దేశంగా ఉన్న చైనా మరింత దయనీయమైన పరిస్థితిలో 2.26 మార్కులు తెచ్చుకుని 153వ స్థానంలో నిలిచింది. ఇక యుద్ధమంటే... అందరికంటే తానే ముందుంటానన్న రీతిలో వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా 1.08 మార్కులతో కింద నుంచి తొలి స్థానంలో నిలిచింది. మరో చిన్న దేశం థాయ్ ల్యాండ్ ఈ దపా అన్ని దేశాల కంటే కూడా మెరుగైన పనితీరు కనబరచి... 2018లో వచ్చిన 1.69 మార్కుల నుంచి 2019లో ఏకంగా 6.32 మార్కులకు చేరింది. ఈ జాబితాలో మరో ఆసక్తికర అంశమేమంటే... అప్రజాస్వామిక దేశాల జాబితాలో ఉన్న చిలీ, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలు ఈ దఫా ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి. అదే సమయంలో ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మాల్టా ఈ సారి అప్రజాస్వామిక దేశంగా మారిపోయింది.