Begin typing your search above and press return to search.

ఉగ్రవాదులు అన్ని చెక్ పోస్ట్ లు ఎలా దాటారు?

By:  Tupaki Desk   |   4 Jan 2016 12:39 PM IST
ఉగ్రవాదులు అన్ని చెక్ పోస్ట్ లు ఎలా దాటారు?
X
దేశ సరిహద్దులు అక్రమంగా దాటిన ఉగ్రవాదులు.. పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ స్టేషన్ పై దాడికి పాల్పడటం తెలిసిందే. ఇంత పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతున్న ఉగ్రవాదులు.. భారీ ఎత్తున తమ వెంట మందుగుండు సామాగ్రి తెచ్చుకున్నారు. దేశ సరిహద్దుల్ని దాటేసినా.. సరిహద్దుల దగ్గర నుంచి ఎయిర్ బేస్ వెనక్కి వరకూ ఎలా రాగలిగారు? వారి మార్గమధ్యంలో ఉన్న చెక్ పోస్టల తనిఖీ నుంచి ఎలా తప్పించుకున్నారు? పెద్దఎత్తున మందుగుండు సామాగ్రితో ఉన్న వారిని భద్రతా దళాలు ఇట్టే గుర్తిస్తాయి.

కానీ.. అలాంటి వాటినుంచి వారు ఎలా తప్పించుకున్నారన్న ప్రశ్నకు సమాధానం వింటే ఆశ్చర్యపోక మానదు దేశ సరిహద్దుల్ని దాటిన ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో ఉన్నారు. ఇలానే ముందుకు సాగితే చెక్ పోస్టులలో దొరికిపోయేవారు. కానీ.. వారు ఎస్పీ కారును దొంగలించి వెళ్లటం వారి పని సులువైంది. ఎస్పీ కారు మీద ఉన్న నీలి రంగు బుగ్గ ఉండటంతో ఎవరూ తనిఖీ చేసే సాహసం చేయలేదు.

దీనికి తోడు.. చెక్ పోస్టులకు వచ్చిన ఒక మెసేజ్ కూడా కారును ఆపకుండా ఉండేలా చేసిందని చెబుతున్నారు. పోలీసు ఉన్నతాదికారి ఒకరు ఆకస్మిక తనిఖీలకు రానున్నారంటూ ఒక మెసేజ్ చెక్ పోస్టులకు అందింది. దీంతో.. అంత పెద్ద అధికారి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపకుండా.. సెల్యూట్ కొట్టి పంపేయటంతో ఉగ్రవాదులు తాము అనుకున్న లక్ష్యానికి సులువుగా చేరగలిగారు.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వెనుక వైపు ఉన్న ఆడవిలోకి బుగ్గకారుతో ప్రవేశించి.. ఎయిర్ బేస్ వెనుక ఉన్న గోడకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో తాము దొంగలించిన కారును నిలిపివేసి.. టార్గెట్ వైపు దూసుకెళ్లారు. అయితే.. చెక్ పోస్టులకు మేసేజ్ ఎవరు పంపారు? ఎలా పంపారు? ఎందుకు పంపారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.