Begin typing your search above and press return to search.

సెక్స్ టాయిస్ పిచ్చ మ‌నోళ్ల‌కి ప‌ట్టేసింద‌ట‌

By:  Tupaki Desk   |   11 Dec 2017 11:08 AM IST
సెక్స్ టాయిస్ పిచ్చ మ‌నోళ్ల‌కి ప‌ట్టేసింద‌ట‌
X
గ‌తంలో లోగుట్టుగా మాట్లాడుకునే సెక్స్ మాట‌లు ఇప్పుడు ఓపెన్ గానే మాట్లాడేసుకుంటున్నారు. సెక్స్ మీద అవ‌గాహ‌నే కాదు.. ఆస‌క్తి అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప‌శ్చిమ‌దేశాల్లో జోరుగా ఉండే సెక్స్ టాయిస్ వినియోగం ఇప్పుడు దేశంలోనూ పెరుగుతున్న కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దేశంలో సెక్స్ టాయిస్ ను ఆన్ లైన్లో అమ్మే సంస్థ ఒక స‌ర్వేను నిర్వ‌హించింది. దీనికి సంబంధించిన వివ‌రాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.సెక్స్ టాయిస్ పై దేశంలో పెరుగుతున్న ఆస‌క్తి తాజా స‌ర్వే ఫ‌లితాలు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. నాలుగేళ్లుగా సెక్స్ టాయిస్ బిజినెస్ లో ఉన్న ఈ సంస్త త‌మ‌కు మొత్తం 80 వేల ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లుగా వెల్ల‌డించింది.

సెక్స్ ఉత్ప‌త్తుల కొనుగోళ్ల‌లో మ‌హారాష్ట్ర టాప్ లో ఉంటే.. టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో మూడు ద‌క్షిణాది రాష్ట్రాలు ఉండ‌టం గ‌మ‌నార్హం. దేశ వ్యాప్తంగా సెక్స్ టాయిస్ కొనేవారిలో పురుషులు 62 శాతం మంది ఉంటే.. మ‌హిళ‌లు 38 శాతం ఉన్న‌ట్లుగా తేలింది.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఈ టాయిస్‌ను ఆర్డ‌ర్ల‌కు సంబంధించి మ‌గాళ్లు రాత్రి 10 గంట‌ల త‌ర్వాత నుంచి అర్థ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కూ ఆర్డ‌ర్లు చేస్తుంటే.. మ‌హిళ‌ల్లో 38 శాతం మంది ఉద‌యం 10 గంట‌ల నుంచి అర్థ‌రాత్రి ఒంటిగంట మ‌ధ్య‌లో చేస్తార‌ని వెల్ల‌డించారు. పురుషుల కంటే వీటిని అధికంగా ఆర్డ‌ర్ చేసే వారు బ‌రోడ‌.. పుణె.. తిరువ‌నంత‌పురంలోని మ‌హిళ‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దేశంలోని ప‌లు ద్వితీయ‌.. తృతీయ శ్రేణి ప‌ట్ట‌ణాల్లో ఏడాది వ్య‌వ‌ధిలో అమ్మ‌కాలు 25 శాతం పెరిగిన‌ట్లుగా వెల్ల‌డైంది.

వీటిని కొనుగోలు చేసే టాప్ సెవ‌న్ రాష్ట్రాల్లో చూస్తే..

1. మ‌హారాష్ట్ర

2. క‌ర్ణాట‌క‌

3. ప‌శ్చిమ‌బెంగాల్‌

4. త‌మిళ‌నాడు

5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

6. గుజ‌రాత్‌

7. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌

అదే స‌మ‌యంలో న‌గ‌రాల విష‌యంలోకి వ‌స్తే మాత్రం రాష్ట్రాల‌కు భిన్న‌మైన స్థానాల్లో నిల‌వ‌టం గ‌మ‌నార్హం. టాయిస్ కొనుగోళ్ల‌లో మ‌హారాష్ట్ర మొద‌టిస్థానంలో నిల‌వ‌గా.. న‌గ‌రాల విష‌యానికి వ‌స్తే మాత్రం ఢిల్లీ మ‌హాన‌గ‌రం ముందుంది. త‌ర్వాతి స్థానంలో ముంబ‌యి.. మూడోస్థానంలో బెంగ‌ళూరు.. నాలుగో స్థానంలో చెన్నై.. ఐదో స్థానంలో కోల్ క‌తా ఉంది. సెక్స్ టాయిస్ కొనుగోళ్ల‌లో టాప్ 7 ప్లేస్ లో స్థానం చోటు సంపాదించ‌ని తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మాత్రం వీటిని కొనుగోలు చేసే న‌గ‌రాల్లో ఆరోస్థానంలో నిల‌వ‌టం గ‌మ‌నార్హం.

మ‌హాన‌గ‌రాల్ని ప‌క్క‌న పెట్టి.. ద్వితీయ‌..తృతీయ శ్రేణిప‌ట్ట‌ణాల విష‌యానికి వ‌స్తే.. టాయిస్ కొనుగోళ్ల‌లో నోయిడా మొద‌టిస్థానంలో నిలిస్తే.. ల‌క్నో.. గుర్ గావ్‌.. చండీగ‌ఢ్‌.. జైపూర్ లాంటివి త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక‌.. తృతీయ శ్రేణి ప‌ట్టణాల విష‌యానికి వ‌స్తే మ‌హారాష్ట్రలోని నాందేడ్‌.. మ‌ణిపూర్ లోని ఇంఫాల్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంత‌పురం ప‌ట్ట‌ణాలు ఉండ‌టం విశేషం. సెక్స్ టాయిస్ కొనుగోలులో ఒక్కో ప్రాంతం వారిది ఒక్కో టేస్ట్ గా తేల్చారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన వారు కేండీ ఫ్యాంటీస్‌కు ఎక్కువ‌గా ఆర్డ‌ర్ ఇస్తుంటార‌ట‌. పంజాబ్ కు చెందిన వారు లైంగిక ఉద్రేకాల‌ను ఇచ్చే ఉత్ప‌త్తుల‌ను.. అసోం ప్ర‌జ‌లు బీడీఎస్ఎం ఉత్ప‌త్తులు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసులు అంగం సైజు పెంచే ఉత్ప‌త్తులు.. హైద‌రాబాద్ కు చెందిన వారు సెక్సీ క‌ట్ డ్రాయ‌ర్లు ఎక్కువ‌గా కొనుగోలు చేస్తున్న‌ట్లు తేల్చారు. ఇక‌..తెలంగాణ వాసులు సెక్సీ లోదుస్తులు ఎక్కువ‌గా కొంటున్న‌ట్లు తేలింది. సెక్స్ టాయిస్ కొనుగోళ్ల‌లో 25-34 మ‌ధ్య వ‌య‌స్కులే ఎక్కువ‌గా ఉన్నారు. వీరు44 శాతంమంది ఉన్న‌ట్లు తేలింది.

మంగ‌ళూరు వాసులు సెక్స్ కోస‌మే షాపింగ్ చేస్తార‌ని చెప్ప‌గా.. భోపాల్ వాళ్లు కండోమ్స్ లో అన్ని ఫ్లేవ‌ర్లు వాడే్స్తార‌ట‌. నాగ‌పూర్ వాసులు తామిచ్చిన ఆర్డ‌ర్స్ ను స్వ‌యంగా క‌లెక్ట్ చేసుకుంటార‌ట‌. ప్ర‌పంచంలో సెక్సువ‌ల్ గా యాక్టివ్‌గా ఉండే దేశాల్లో మ‌న‌ది ఐదో ర్యాంక్ అని ఈ స‌ర్వే పేర్కొంది. మ‌గాళ్ల‌కు అత్యంత ఇష్ట‌మైనవి లూబ్రికెంట్స్ అయితే.. ఆడ‌వారు మాత్రం అత్య‌ధికంగా మ‌సాజ‌ర్స్ ను కొనుగోలు చేస్తున్న‌ట్లుగా వెల్ల‌డించింది.