Begin typing your search above and press return to search.
కరోనాపై యుద్ధం.. మహాభారత యుద్ధానికి మించినదా?
By: Tupaki Desk | 26 March 2020 8:00 PM ISTకంటికి కనిపించని శత్రువుతో పోట్లాడతారా? సాధ్యమే కాదంటారు. మరి.. ఏకంగా యుద్ధమే చేయాల్సి వస్తే.. అంతకు మించిన ఇబ్బంది ఏముంటుంది చెప్పండి. అందుకే.. కరోనా వైరస్ పై తాము చేస్తున్న పోరాటంపై దాదాపు మూడు నెలల క్రితమే చైనా అధ్యక్షుడు ఏకంగా పిశాచితో తాము పోరాడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒక దేశాధ్యక్షుడి నోటి వెంట అంత తీవ్రమైన వ్యాఖ్య వచ్చిన వేళ.. మిగిలిన ప్రపంచం అలెర్ట్ కావాల్సింది. కానీ.. కాలేదు. అందుకే ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి దేశాలన్ని.
ఇందుకు భారత్ సైతం మినహాయింపు కాదు. కాకుంటే.. అగ్రరాజ్యమైన అమెరికా.. ఫ్రాన్స్.. జర్మనీ.. ఇరాన్ లాంటి దేశాలతో పోలిస్తే.. ప్రస్తుతానికి భారత్ పరిస్థితి ఫర్లేదని చెప్పాలి. కరోనాను కంట్రోల్ చేసే అంశంపై ఈ నెల మొదట్లో చర్యలు మొదలైనా.. దాని తీవ్రత పెరిగింది మాత్రం వారం రోజులుగానేనని చెప్పాలి. రెండురోజుల క్రితం.. యావత్ దేశం మొత్తాన్ని షట్ డౌన్ చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయాన్ని ప్రకటించటం.. అది కూడా 21 రోజుల పాటు అని చెప్పినప్పుడు కానీ చాలామందికి దీని తీవ్రంత ఎంతన్న విషయంపై మరింత క్లారిటీ వచ్చింది.
కరోనాపై తాము చేస్తున్నయుద్ధంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమే కాదు.. రానున్న రోజులు మరెంత కఠినంగా ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం కరోనాపై తాము చేస్తున్న యుద్ధాన్ని ఇతిహాస గ్రంధంలో చెప్పే మహాభారత యుద్ధంతో పోల్చారు మోడీ. మహాభారత యుద్ధం 18 రోజులే జరిగిందని.. కానీ ఇప్పుడు చేస్తున్న యుద్ధం 21 రోజులపాటు సాగుతుందన్నారు.
అప్పట్లో మహాభారత సంగ్రామానికి రథసారథి కృష్ణ భగవానుడు అయితే.. ఇప్పుడు చేస్తున్న యుద్ధానికి దేశంలోని 130 కోట్ల మంది భారతీయులూ సారథులే అంటూ వ్యాఖ్యానించారు. నిరుపేదలు.. సామాన్యులు.. దినసరి కూలీలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని.. అయితే.. తమ ముందు ఉన్న కర్తవ్యం కరోనా వైరస్ ను నిర్మూలించటంగా చెప్పారు. ఈ మహమ్మారికి పేద.. గొప్ప అన్న తారతమ్యం లేదని.. ఎవరినైనా కాటేస్తుందన్నారు. అందుకే.. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మహాభారత సంగ్రామంలో మనుషులే కాదు.. పశుపక్ష్యాదులు ఎంత భారీగా ప్రాణాలు కోల్పోయాయో తెలిసిందే. తాజాగా చేస్తున్న యుద్ధంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగానే కాదు.. కలలో ఊహించనంతగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.