Begin typing your search above and press return to search.

డోక్లామ్ ఎపిసోడ్‌ కి ఇదే చ‌క్క‌టి ప‌రిష్కార‌మ‌ట‌

By:  Tupaki Desk   |   7 Aug 2017 8:22 AM GMT
డోక్లామ్ ఎపిసోడ్‌ కి ఇదే చ‌క్క‌టి ప‌రిష్కార‌మ‌ట‌
X
కొద్దిరోజులుగా స‌రిహ‌ద్దు వివాదంగా మారిన డోక్లామ్ ఇష్యూ పుణ్య‌మా అని భార‌త్ - చైనాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో చైనా.. భార‌త్ లు రెండూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌టంతో ఈ వ్య‌వ‌హారం అంత‌కంత‌కూ ముదురుతుందే త‌ప్పించి త‌గ్గ‌టం లేదు. ఈ ఉద్రిక్త‌త‌ల‌కు చెక్ పెట్టే ఛాన్స్ లేదా? అన్న సందేహం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ప‌రిస్థితి తీవ్ర‌త దృష్ట్యా డోక్లామ్ వ్య‌వ‌హారాన్ని అటు చైనా.. ఇటు భార‌త్ లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. దీంతో.. ప‌రిష్కారం అంత సులువు కాద‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. డోక్లామ్ ఎపిసోడ్ మీద ఈ మ‌ధ్య‌న చైనా మాట‌ల యుద్ధం చేయ‌టంతో పాటు.. తాటాకు చ‌ప్పుళ్లు చేస్తున్న వైనం తెలిసిందే. త‌న అధికారిక మీడియాను ఉప‌యోగించుకొని మైండ్ గేమ్ మొద‌లెట్టిన చైనా.. భార‌త్ మీద ప‌రిమిత మోతాదులో మిల‌ట‌రీ ఆప‌రేష‌న్ చేస్తామ‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌టం.. యుద్ధం మేఘాలు క‌మ్ముకుంటున్నాయి జాగ్ర‌త్త లాంటి హ‌డావుడి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి.

ఇలాంటి వేళ‌.. భార‌త్ సైతం వెన‌క్కి త‌గ్గ‌కుండా మాట‌కు మాట చెబుతూ.. త‌మ విధానాన్ని క్లియ‌ర్ గా వెల్ల‌డిస్తున్నాయి. ఎంత‌కూ ఒక కొలిక్కి రాని డోక్లామ్ ఎపిసోడ్‌ కు ముగింపు ప‌లికే ఛాన్స్ లేదా? అంటే ఉందంటున్నాయి మ‌న ర‌క్ష‌ణ వ‌ర్గాలు. భూటాన్ భూభాగ‌మైన డోక్లామ్‌ లో అన‌వ‌స‌రంగా పాగా వేసిన చైనా ద‌ళాలు వెన‌క్కి త‌గ్గి వెళ్లిపోతే.. మిత్రుడికి ర‌క్ష‌గా నిలిచిన భార‌త్ సైన్యం కూడా వెన‌క్కి తిరిగి వెళుతుంద‌ని చెబుతున్నారు. ఇరు దేశాలు వెన‌క్కి త‌గ్గి.. ఎవ‌రి దారిన వారు వెళ్లిపోతే వివాదం ముగిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఎంత‌కూప‌క్క‌దేశాల స‌రిహ‌ద్దుల్ని కాజేయాల‌నే దుష్ట‌బుద్ధి ఉన్న చైనా.. ఇలాంటి ప‌రిష్కారాల‌కు ఓకే చెబుతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. భార‌త్ తో యుద్ధం చేసే దిశ‌గా చైనా నిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ లేద‌న్న మాట బలంగా వినిపిస్తోంది.

చైనా తీరు నేప‌థ్యంలో భార‌త ర‌క్ష‌ణ‌శాఖ కూడా.. ఎలాంటి ప‌రిణామాన్ని అయినా ఫేస్ చేసేందుకు వీలుగా త‌యారుగా ఉంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ చైనా తొంద‌ర‌ప‌డితే.. దాన్ని కంట్రోల్ చేయ‌టానికి ఏం చేయాలో అది చేసేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ త‌న దుర్మార్గాన్ని ప్ర‌ద‌ర్శించే ఛాన్స్ త‌క్కువ‌గానే ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.