Begin typing your search above and press return to search.
రూ.1.25లక్షల కోట్ల డీల్ క్యాన్సిల్
By: Tupaki Desk | 14 April 2015 4:08 PM ISTవిదేశాంగ విధానంలోనూ.. పలు దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లోనూ సరికొత్తగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ మరో ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. యూపీఏ హయాంలో దాదాపు ఎనిమిదేళ్ల క్రితం చేసుకన్న ఒక ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోనే అతి పెద్ద డీల్‌గా చెప్పే రఫాలే ఒప్పందాన్ని మోడీ సర్కారు రద్దు చేసుకుంది. 2007లో నాటి యూపీఏ సర్కారు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. యుద్ధవిమానాల కొనుగోలు కోసం బిడ్డింగ్ నిర్వహించింది. అప్పట్లో దాని విలువ రూ.1.25లక్షల కోట్లుగా అంచనా వేశారు. 18 విమానాలను అప్పగించాలని.. ఆ తర్వాత దానికి సంబంధించిన సాంకేతికతను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు అప్పగించి ఇండియాలో విమాన తయారీకి సహకరించాలన్నది నాటి ఒప్పందం.
అయితే... గత ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని భిన్నంగా ముందుకెళుతున్న మోడీ సర్కారు రఫాలేతో డీల్ క్యాన్సిల్ విషయాన్ని నేరుగా చెప్పకుండా నర్మగర్భంగా చెబుతోంది. గతంలో మాదిరి మధ్యవర్తులతో కాకుండా.. విదేశాలతో నేరుగా వ్యాపార ఒప్పందాలు నిర్వహించే పద్ధతిని అనుసరిస్తున్న మోడీ సర్కారు అతి ఖరీదైన డీల్‌కు స్వస్తి పలికింది.
అదే సమయంలో రెండు రోజుల క్రితం 36రఫాలే యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో భారత సర్కారు ఒప్పందం చేసుకోవటం గమనార్హం. మొత్తానికి యూపీఏ నాటి ఒప్పందం చెల్లకుండా తాను చేసుకున్న డీల్ చెల్లేలా మోడీ చేశారు. చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్ని అయినా సులువగా చేసేయొచ్చు మరి.