Begin typing your search above and press return to search.

అమెరికా కంటే ఆ విష‌యంలో మ‌నమే తోపులం

By:  Tupaki Desk   |   6 Sept 2017 1:00 PM IST
అమెరికా కంటే ఆ విష‌యంలో మ‌నమే తోపులం
X
అగ్ర‌రాజ్యం అమెరికాకు ఏ విష‌యంలో అయినా ఢీకొట్టాలంటే అంత ఈజీ కాద‌నే విష‌యం తెలిసిందే. అందులోనూ టెక్నాల‌జీకి కేరాఫ్ అడ్ర‌స్ అయిన యూఎస్‌ ను అదే టెక్నాల‌జీతో కొట్ట‌డం అంటే అయ్యే ప‌ని కాద‌ని చాలా మంది తేల్చేస్తారు. కానీ ఆ అనూహ్య ప‌రిణామ జ‌రిగింది. అర‌చేతి విప్ల‌వంగా భావిస్తున్న సెల్‌ ఫోన్ ద్వారా అమెరికాను భార‌త‌దేశం దాటుకుపోయింది. అది కూడా మొబైల్ రంగంలో విప్లవంగా పేరొందిన జియోద్వారా. జియో రాక పుణ్యామా అని ఇంట‌ర్నెట్ డేటా ఉప‌యోగంలో అమెరికాను ఇండియా దాటేసింది.

ఆల్ ఫ్రీ నినాదంతో ఉచిత ఆఫర్లతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త‌న ఖాతాలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను జోడించుకున్న సంగ‌తి తెలిసిందే. డేటా ఆధారంగా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ - వీడియోకాల్స్‌ - డేటా - ఎస్‌ ఎంఎస్‌ లు వంటి ఎన్నో ఆఫర్లతో రిలయన్స్‌ సంస్థ గత సెప్టెంబర్‌ లో రిలయ్‌న్స్‌ జియో సిమ్‌ లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిపిందే. అప్ప‌టివ‌ర‌కు ఉన్న‌ ఆపరేటర్లందరూ కలిసి గత పాతికేళ్లలో స్థాపించుకున్న 2జీ నెట్‌ వర్క్‌ కు మించి 4జీ నెట్‌ వర్క్‌ ను జియో సంస్థ ఏర్పాటు చేసుకుంది. అందుకు ఈ కంపెనీ తీసుకున్న సమయం మూడేళ్లు మాత్రమే. ఇంత ప‌క్కా ప్లాన్‌ తో ముందుకు సాగ‌డం ద్వారా అమెరికాను వెనక్కి నెట్టివేసి అగ్రస్థానంలోకి ఇండియా దూసుకెళ్లేలా చేసి ఆ దేశానికి జియో షాకిచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్లు త‌క్కువ‌గా డేటా ఉప‌యోగిస్తార‌నే భావ‌న‌ను తొల‌గించింది.

టెలికాం రంగంలో జియో అనేక విప్ల‌వాత్మ‌క ప‌రిణామాల‌కు బీజం వేసింద‌ని అంటున్నారు. ముఖేష్ అంబానీ క‌ల‌ల ప్రాజెక్టు అయిన జియో ఇచ్చిన దుమ్మురేపే ఆఫ‌ర్ల కార‌ణంగా 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను సొంతం చేసుకుంది. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఇంత త‌క్కువ సమ‌యంలో ఈ స్థాయిలో వినియోగ‌దారుల‌ను తన ఖాతాలో చేర్చుకోలేద‌ని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో డాడా విష‌యంలో త‌న ప‌టిష్ట‌మైన నెట్‌ వ‌ర్క్ వ‌ల్ల విస్తృతంగా డాటా వాడ‌కం పెరిగింది. జియో రాకముందు నెలకు 20 కోట్ల జీబీ మాత్రమే భారతీయులు వినియోగించే వారు జియో రాకతో అది ఏకంగా 125 కోట్ల జీబీకి చేరింది. జియోకు ముందు భారత్‌ 155వ స్థానంలో ఉండగా.. ఇపుడు నంబర్‌ 1 స్థానంలో ఉంది. ఇంత ఆద‌ర‌ణ ద‌క్కేందుకు కార‌ణాలు ఏంట‌ని ఆరాతీస్తే ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇస్తున్నాయి. జియో రాకముందు 1జీబీకి రూ.250 నుంచి రూ.4000 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.50 కంటే తక్కువకే ఒక జీబీ లభిస్తోందని అంటున్నారు. అందుకే టీవీని చూసే సమయంతో పోలిస్తే అంతకు ఏడు రెట్లు మొబైల్‌ పై భారతీయులు గడుపుతున్నారని అది జియోతో మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం 13 కోట్ల మందికి జియో తన సేవలందిస్తోంది. కాగా, ఈ ఏడాది మార్చి 31తో ఆ ఉచిత ఆఫ‌ర్లు ముగిశాయి. ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్ ప్లాన్స్ లోకి ఇచ్చింది.