Begin typing your search above and press return to search.
జనాభాలో చైనాను వెనక్కి నెట్టిన భారత్..!
By: Tupaki Desk | 18 Jan 2023 10:23 PM ISTప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇటీవలి కాలంలో చైనాలో జననాల రేటు క్రమంగా తగ్గుతుండటం.. వయో వృద్ధుల సంఖ్య పెరిగి పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇదే విషయాన్ని తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్యూపీఆర్) సైతం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చైనాను పాపులేషన్ విషయంలో భారత్ వెనక్కి నెట్టినట్లు స్పష్టమవుతోంది. 2022 చివరి నాటికే భారత్ జనాభా 141.7 కోట్లు ఉండగా 2023 జనవరి 28 నాటికి ఆ సంఖ్య 142.3 కోట్లు చేరినట్లు అంచనా డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది.
అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ పరిశోధక సంస్థ మాక్రో ట్రెండ్స్ సైతం భారత్ లో ప్రస్తుత జనాభా 141.2 కోట్ల కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. మరోవైపు చైనా ఇటీవల ప్రకటించిన జనాభా 141.2కోట్లు.
ఈ సంఖ్య కంటే భారత్ జనాభా ఎక్కువగా ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్లేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
2023 చివరి నాటికి భారత్ చైనా రికార్డును అధిగమిస్తుందని ఐక్య రాజ్య సమితి ముందుగా అంచనా వేసింది. అయితే 2023 ప్రారంభంలోనే భారత్ ఆ రికార్డును చేరుకోవడం విశేషం. అంతేకాకుండా 2050 నాటికి భారత్ జనాభా 167 కోట్లు ఉంటుంది ఐరాస అంచనా వేసింది. చైనాలో 2021 కంటే 2022 చివరి నాటికి జనాభా 8.50 లక్షలు తగ్గిందని నేషనల్ బ్యూరో స్టాటిస్టిక్స్ జనవరి 17న ప్రకటించింది.
ప్రస్తుతం ఆ దేశ జనాభా 141. 18 కోట్లుగా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ చైనాను వెనక్కి నెట్టి పాపులేషన్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు 2022 జనవరి 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని ఐరాస ప్రకటించింది. 1974లో 400 కోట్ల జనాభా ఉండగా 48 ఏళ్ళ కాలంలోనే అది రెట్టింపు అయి 800 కోట్లకు చేరుకోవడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.